21 ఏప్రిల్ 2024 - 27 ఏప్రిల్ 2024
జన్మ నక్షత్రం ప్రకారం

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయాలన్న పట్టుదల పెరుగుతుంది.

బంధువర్గంతో తగాదాలు, వివాదాలు పరిష్కారమవుతాయి.

చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు.

స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు.

వివాహాది వేడుకలకు ఘనంగా నిర్వహిస్తారు.

ఆశించినంత ఆదాయం సమకూరి అవసరాలకు ఆదుకుంటుంది.

సోదరులు,సోదరీలతో మరింత సఖ్యత నెలకొంటుంది.

మీపై వచ్చిన అపవాదులు, అభాండాలు తొలగుతాయి.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుని లబ్ధి పొందుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు దక్కవచ్చు.

వ్యాపారాలు గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉంటాయి.

ఉద్యోగాలు ఉన్నత స్థాయికి చేరతాయి.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు ఆస్తి విషయంలో శుభవార్తలు.

సుబ్రహ్మణ్యేశ్వరుని స్మరించండి.

21 ఏప్రిల్ 2024 - 27 ఏప్రిల్ 2024
జన్మ తేది ప్రకారం

కన్య (23 ఆగస్టు నుండి 22 సెప్టెంబర్)

అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తయి ముందడుగు వేస్తారు.

ఆలోచనలు తక్షణం అమలు చేసి కార్యదక్షత చాటుకుంటారు.

ప్రతిభావంతులుగా కీర్తించబడతారు.

దూరపు బంధువులను కలుసుకుని మనస్సులోని భావాలను వెల్లడిస్తారు.

వివాహాది వేడుకల నిర్వహణలో భాగస్వామిగా ఉంటారు.

సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు.

యుక్తి, నేర్పు ఆయుధాలుగా సమస్యల నుంచి గట్టెక్కుతారు.

స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి.

ఉద్యోగార్థులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు.

ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటారు.

జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురవుతుంది.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీ పట్ల కుటుంబ సభ్యులు విశేష ప్రేమాభిమానాలు చూపుతారు.

వృత్తులు, వ్యాపారాలలో గందరగోళం, ఒడిదుడుకులు తొలగుతాయి.

ముఖ్యంగా ఉద్యోగస్తులు ఊపిరిపీల్చుకుంటారు.

రాజకీయవేత్తలు, పరిశోధకులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి