04 మే 2025 - 10 మే 2025
జన్మ నక్షత్రం ప్రకారం

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

కొత్త కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు.

ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు.

సేవాకార్యక్రమాలలో మీ భాగస్వామ్యం పెరుగుతుంది.

ఆప్తుల నుంచి అతి ముఖ్యమైన సమాచారం అందుతుంది.

సూచన..దీనిని రహస్యంగానే ఉంచుకోండి. లేదా నష్టపోతారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం పొందుతారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

సంఘంలో గౌరవమర్యాదలు పెరిగి ప్రత్యేకత సాధిస్తారు.

రావలసిన సొమ్ము అంది ఖర్చులు తట్టుకుంటారు.

విలాసాలకు, వివిధ కార్యక్రమాలకు విరివిగా ఖర్చు చేస్తారు.

ప్రతి పైసా ఖర్చు చేయడంలో ఆలోచించడం ముఖ్యం.

బంధువర్గం సలహాలు,సూచనలు అనుసరిస్తూ శుభకార్యాలు నిర్వహిస్తారు.

మీ ఆభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు.

వాహనాలు, ఒక భవనం కొనుగోలు చేసే వీలుంది.

అలాగే, కొత్త షేర్లలో పెట్టుబడులు సిద్ధం చేస్తారు.

మునుపటి కంటే కాస్త మెరుగుపడి ఊరట చెందుతారు.

వ్యాపారాల విస్తరణలో భాగస్వాముల చేయూత లభిస్తుంది.

కొన్ని వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు.

అనుభవం లేని వ్యాపారాల జోలికి వెళ్లవద్దు. చిక్కులు రావచ్చు.

ఉద్యోగుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మీ పనితనాన్ని అధికారులు మెచ్చుకచుంటారు.

క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం.

మహిళలకు సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి.

ఆంజనేయ దండకం పఠించండి.

04 మే 2025 - 10 మే 2025
జన్మ తేది ప్రకారం

కర్కాటకం (21 జూన్ నుండి 22 జూలై)

మొదట్లో కొంత నిరాశాజనకంగా ఉన్నా క్రమేపీ అనుకూల పరిస్థితులు ఉంటాయి.

బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది.

కొన్ని వివాదాలు, సమస్యల పరిష్కారంలో మరింత చొరవ చూపి విజయం సాధిస్తారు.

వాహనసౌఖ్యం. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులు గౌరవిస్తారు.

నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి

మీ వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారడం విశేషం.

వ్యాపారులు అనుకున్న పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కే ఛాన్స్.

పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు అందుతాయి.

వారం మధ్యలో దూర ప్రయాణాలు. స్వల్ప అస్వస్థత.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి