04 మే 2025 - 10 మే 2025
జన్మ నక్షత్రం ప్రకారం
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
మొదట్లో కష్టానికి తగ్గ ఫలితం కనిపించకపోవచ్చు.
అయినా నమ్మకం కోల్పోవద్దు.
క్రమేపీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు.
మీ ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి.
కొన్ని వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు.
కాంట్రాక్టర్లు, వైద్యులు పేరుగడిస్తారు.
విద్యార్థులు చేజార్చుకున్న అవకాశాలు తిరిగి సాధిస్తారు.
ధైర్యంగా కొన్ని విషయాలలో ముందడుగు వేస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు.
ఆర్థిక పరిస్థితి వారం మధ్య నుండి పుంజుకుంటుంది.
ఖర్చుల నిమిత్తం బాధపడాల్సిన అవసరం లేదు.
సమయానికి అన్నీ సమకూరతాయి.
ఇతరులకు అప్పులు ఇచ్చేటప్పుడు కొంత నిదానం పాటించడం ఉత్తమం.
బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
నగలు, ఇతర విలువైన వస్తువులు కొంటారు. అలాగే, భూములపై పెట్టుబడులు పెడతారు.
కొంత అలసట కారణంగా స్వల్ప రుగ్మతలు రావచ్చు.
వ్యాపారాలు ఒక పద్ధతి ప్రకారం నడిపి లాభాలు పొందుతారు.
గతంలో నత్తనడకన సాగినా ప్రస్తుతం వేగవంతంగా కాగలవు.
భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించండి. లేకుంటే ఇబ్బంది పడతారు.
ఉద్యోగాలలో మీ పనితనం చూసి పై స్థాయి నుంచి మెప్పు లభిస్తుంది.
రాజకీయవేత్తలు, కళాకారులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు.
మహిళలు మనోనిబ్బరంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.
లక్ష్మీనారాయణ అష్టకం పఠించండి.
04 మే 2025 - 10 మే 2025
జన్మ తేది ప్రకారం
వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు.
ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు లోటు లేకుండా గడుస్తుంది.
బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాల పై చర్చిస్తారు.
కొత్త కాంట్రాక్టులు పొందుతారు.
మనస్సుకు తోచిన విధంగానే అడుగువేస్తారు
ఇతరుల సలహాల పై ఆధారపడరు.
విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు.
ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.
వ్యాపారస్తులు లాభనష్టాలు పట్టించుకోకుండా విస్తరణ పై దృష్టి సారిస్తారు.
ఉద్యోగులు విధి నిర్వహణలో పొరపాట్లు సరిదిద్దుకోవడంలో సఫలమవుతారు.
పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు ప్రయత్నాలు సఫలం.
వారాంతంలో స్వల్ప అస్వస్థత. దూర ప్రయాణాలు.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి











