06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

మీ కార్యదక్షతను చాటుకుంటారు.

కొన్ని వ్యవహారాలలో పట్టింది బంగారమే.

ఆత్మీయుల నుంచి ఊహించని సహాయసహకారాలు అందుతాయి.

విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

చాకచక్యంగా కొన్ని వివాదాల నుండి గట్టెక్కుతారు.

ఆకస్మిక ధన లాభం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.

ఖర్చులు తగ్గి పొదుపు పాటిస్తారు.

భార్యాభర్తల మధ్య విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు.

కుటుంబ సభ్యులు మీ మాటకు మరింత గౌరవం ఇస్తారు.

సంతానపరంగా శుభవర్తమానాలు రాగలవు.

సంపూర్ణ ఆరోగ్యవంతులై దైనందిన కార్యక్రమాలు చేపడతారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు వీడతాయి.

వ్యాపారాలలో ముందడుగు వేస్తారు, మరింతగా లాభాలు తథ్యం.

ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉన్నత పోస్టులు దక్కవచ్చు.

క్రీడాకారులు, రాజకీయవేత్తలు, కళాకారులకు శుభవార్తలు.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

మిథునం (21 మే నుండి 20 జూన్)

కొత్త విషయాలు తెలుస్తాయి.

ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రావచ్చు.

రాబడి అనూహ్యంగా కొంత పెరుగుతుంది.

సన్నిహితులతో విభేదాలు తీరతాయి.

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.

ఎంతటి కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.

వాగ్దాటితో అందర్నీ ఆకట్టుకుంటారు.

నిరుద్యోగుల ప్రతిభ వెలుగుచూస్తుంది.

గృహ, వాహనయోగాలు కలిగే సూచనలు.

వ్యాపారులకు ఊహించని పురోగతి కనిపిస్తుంది.

ఉద్యోగులకు విధుల నిర్వహణలో ప్రశంసలు.

పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం.

కళాకారులు, పరిశోధకులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

వారాంతంలో బంధువులతో వివాదాలు. మానసిక ఆందోళన.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి