06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం



ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

మిత్రులతో విభేదాలు తొలగుతాయి.

చిరకాల ప్రత్యర్థులను కూడా మీవైపునకు ఆకట్టుకుంటారు.

ఉద్యోగ, వివాహయత్నాలు కలసివస్తాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ముఖ్య కార్యక్రమాలు సమయానుసారం పూర్తి చేస్తారు.

చిన్ననాటి మిత్రులతో హుషారుగా గడుపుతారు..

వాహనాల విషయంలో మెలకువ అవసరం.

రావలసిన సొమ్ము అందుతుంది.

రుణ బాధల నుంచి విముక్తి. కొత్త పొదుపుపథకాలలో చేరతారు.

భార్యాభర్తల మధ్య ఆపార్ధాలు తొలగుతాయి.

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు.

బంధువర్గం నుంచి అనుకూల సమాచారం అందుకుంటారు.

కొంత నలత చేసి ఉపశమనం పొందుతారు.

ఆస్తుల క్రయవిక్రయాలలో గందరగోళం తొలగుతుంది.

సరైన రేటుకు లావాదేవీలు పూర్తి చేస్తారు.

వ్యాపారులకు పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు.

ఉద్యోగులు విధుల్లో సత్తా చాటుకుంటారు.

పై స్థాయి వారి మెప్పు కూడా లభిస్తుంది.

వైద్యులు, రాజకీయవేత్తలు,కళాకారులకు అనుకోని ఆహ్వానాలు రాగలవు.

టెక్నికల్రంగం వారికి రెండుమూడు అవకాశాలు దక్కుతాయి.

మహిళలకు విశేష ఆదరణ లభిస్తుంది.

శివ స్తోత్రాలు పఠించండి.

06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

ధనుస్సు (23 నవంబర్ నుండి 22 డిసెంబర్)

నూతనోత్సాహంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు.

నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

కొన్ని వేడుకలు, విందువినోదాలలో పాల్గొంటారు.

ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తారు.

సమాజంలో మరింత గౌరవమర్యాదలు పొందుతారు.

అదనపు ఆదాయంతో అవసరాలు తీరతాయి.

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు.

దేవాలయాలు సందర్శిస్తారు.

వ్యాపారులు లాభాల బాటపడతారు.

ఉద్యోగవర్గాలకు సమస్యల నుంచి విముక్తి.

పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు.

కళాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు.

వారారంభంలో దూర ప్రయాణాలు.

బంధువులతో తగాదాలు.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి