05 ఏప్రిల్ 2026 - 11 ఏప్రిల్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

యత్నకార్యసిద్ధి.

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు.

గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి.

అయినవారి నుంచి ఆహ్వానాలు రాగలవు.

మీ మనస్సులోని భావాలను ఆప్తులతో పంచుకుంటారు.

కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు.

ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం.

నూతన ఒప్పందాల ద్వారా కొంత సొమ్ము సమకూరుతుంది.

అందరితోనూ సంతోషకరంగా గడుపుతారు.

వివాహాది సంబరాలతో హడావిడిగా గడుపుతారు.

సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి.

మరిన్ని ఆస్తులు కొనుగోలుకు తగిన ప్రయత్నాలు సాగిస్తారు. వాహన యోగం.

నరాలు సంబంధిత రుగ్మతలు కొంత బాధిస్తాయి.

అయితే ఉపశమన చర్యల ద్వారా కొంత తగ్గుముఖం పట్టవచ్చు.

పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి.

విస్తరణ చర్యలు వేగవంతంగా చేస్తారు.

విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు.

బాధ్యతలపై రాజీపడకుండా పూర్తి చేస్తారు.

రాజకీయ,పారిశ్రామికవర్గాలకు, క్రీడాకారులకు మరింత కలసి వచ్చే కాలం.

మహిళలకు ఆస్తి లాభాలు అందుతాయి.

టెక్నికల్ రంగం వారికి కొత్త అవకాశాలు దక్కవచ్చు.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

05 ఏప్రిల్ 2026 - 11 ఏప్రిల్ 2026
జన్మ తేది ప్రకారం

మేషం (21 మార్చి నుండి 19 ఏప్రిల్)

అనుకున్న కార్యక్రమాలలో కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు.

కష్టమే తప్ప ఫలితం కనిపించదు.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది.

శారీరక రుగ్మతలతో ఇబ్బందిపడతారు.

ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది.

బంధువర్గం నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

వ్యాపారులకు ఆశించిన లాభాలు కష్టమే.

ఉద్యోగులకు కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొంత నిరాసక్తత.

వారాంతంలో ధన లబ్ధి. వివాదాల పరిష్కారం.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి