
06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.
దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.
ఎటువంటి బాధ్యతనైనా నేర్పుగా పూర్తి చేస్తారు.
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది.
మిత్రుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి.
ఇతరులకు సైతం సాయపడే మనస్తత్వం కలిగి ఉంటారు.
అవసరాలకు తగినంతగా సొమ్ము అందుతుంది.
ఊహించని రీతిలో స్నేహితుల నుంచి ధనలబ్ధి.
ఖర్చులు కొంతమేర తగ్గి ఊపిరి పీల్చుకుంటారు.
కుటుంబంలో అందరి మన్ననలు పొందుతారు.
భార్యాభర్తల మధ్య ఒక విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడుతుంది.
బంధువుల సమస్యలు సైతం పరిష్కరిస్తారు.
ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు.
స్థిరాస్తుల కొనుగోలుపై తుది నిర్ణయం తీసుకుంటారు.
ఇంటి నిర్మాణాలు చేపడతారు.
వ్యాపారాలలో చికాకులు తొలగి లాభాలు అందుకుంటారు.
కొత్త భాగస్వాముల చేయూత లభిస్తుంది.
ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి.
ఉన్నతాధికారులు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు.
కళాకారులు, పారిశ్రామిక,వైద్యరంగాల వారికి నూతనోత్సాహం.
అవకాశాలు మరింత పెరుగుతాయి.
టెక్నికల్ రంగం వారికి శ్రమ ఫలిస్తుంది.
మహిళలకు ధనలాభ సూచనలు.
అంగారకస్తోత్రం పఠించండి.

06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ తేది ప్రకారం
రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
మొత్తంమీద కొన్ని రుణాల నుంచి బయటపడతారు.
సన్నిహితులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
శుభకార్యాలు, దైవకార్యాలలో పాల్గొంటారు.
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
నిరుద్యోగులకు ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి.
వ్యాపారస్తులు విధుల్లో ముందడుగు వేస్తారు.
ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు ఆశ్చర్యపరుస్తాయి.
పారిశ్రామికవేత్తల కృషి కొంత ఫలిస్తుంది.
శాస్త్రవేత్తలు, క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధిస్తారు.
వారాంతంలో అనారోగ్య సూచనలు. ఆకస్మిక ప్రయాణాలు.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి












