
06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం
కొత్త కార్యక్రమాలు చేపడతారు.
మిత్రుల సహాయంతో కొన్ని విజయాలు సాధిస్తారు.
దూరమైన ముఖ్యమైన వ్యక్తులు తిరిగి చేరువ కాగలరు.
ఆత్మనిబ్బరంతో కొన్ని కష్టాలు తట్టుకుని నిలబడతారు.
నిరుద్యోగులకు ఉద్యోగలాభం.
పలుకుబడి కలిగిన వ్యక్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.
తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు.
రావలసిన సొమ్ము మొత్తం మీద చేతికందుతుంది.
అదనపు ఖర్చులు తగ్గించడం ద్వారా పొదుపు చేస్తారు.
ఆర్థిక విషయాలలో హామీలు మాత్రం వద్దు.
కుటుంబంలో ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.
సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు.
మీ తెలివితేటలకు బంధువులు ఆశ్చర్యపడతారు.
ఒకరి వివాహ విషయంలో హడావిడిగా గడుపుతారు.
ఆరోగ్యం మెరుగవుతుంది.
హుషారుగా కార్యక్రమాలలో పాల్గొంటారు.
స్థిరాస్తులు కొనుగోలుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారు. వాహనయోగం.
వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.
విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.
ఊహించని రీతిలో భాగస్వాములు చేరతారు.
ఉద్యోగులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
విధులలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.
వైద్యులు, పారిశ్రామివేత్తలు, కళాకారులకు సమస్యలు తీరి ఒడ్డునపడతారు.
టెక్నికల్ రంగం వారికి ఊహించని పిలుపు రావచ్చు.
మహిళలకు స్వల్ప ధనలబ్ధి.
వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ తేది ప్రకారం
ఎంతటి కార్యక్రమమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
అందరిలోనూ మంచి గుర్తింపు లభిస్తుంది.
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.
ఉద్యోగ, వివాహ యత్నాలు కలసి వస్తాయి.
అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
సమాజసేవలో భాగస్వాములవుతారు.
నూతన విద్యావకాశాలు లభిస్తాయి.
వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగుల సేవలకు మరింత గుర్తింపు లభిస్తుంది.
కళాకారులకు అన్నింటా విజయాలే.
వైద్యులు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు.
వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు.
స్నేహితులతో తగాదాలు.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి












