19 మార్చి 2026 - 06 ఏప్రిల్ 2027
జన్మ నక్షత్రం ప్రకారం

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఆదాయం – 5, వ్యయం – 5, రాజపూజ్యం – 7, అవమానం – 7

వీరికి జూన్‌1 వరకు గురువు శుభకారకుడు.

తదుపరి వ్యయస్థితిలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంత సానుకూల కాలం.

ఇక అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది.

డిసెంబర్‌5వరకు రాహు,కేతువులు సప్తమ,జన్మరాశుల్లో సంచారం.

తదుపరి షష్ఠమ, వ్యయస్థానాలలో సంచరిస్తారు.

మొత్తానికి రాహుకేతువులు కూడా అంతగా అనుకూలురు కారు.

ఈ రీత్యా పరిశీలిస్తే ఆర్థికంగా ఇబ్బందులు తగ్గినా ఏదో రూపంలో రుణదాతలను ఆశ్రయిస్తారు.

ఖర్చులు తట్టుకునేందుకు యత్నిస్తారు.

కుటుంబంలో అకారణంగా కొన్ని వివాదాలు ఏర్పడి సతమతం కాగలరు.

జూన్‌ వరకూ కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశాలున్నాయి.

ఇల్లు, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు నెరవేరతాయి.

ఎదుటవారిని ఆకట్టుకోవడంలో తెలివిగా వ్యవహరించండి.

సప్తమ రాహువు సంచార సమయంలో జీవిత భాగస్వాముల మధ్య విభేదాలు, కొంత దూరం పెరగొచ్చు.

ఓర్పు, సహనంతో మెలగడం ఎంతైనా అవసరం.

విద్యార్థులకు ద్వితీయార్థంలో శుభవార్తలు అందుతాయి.

అష్టమ శని ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడి వైద్య ఖర్చులు పెరుగుతాయి.

ఎముకలు, వాత సంబంధిత రుగ్మతలతో బాధపడతారు.

ఎదుటవారి విషయాలలో జోక్యం వల్ల మాటపడాల్సిన పరిస్థితులు ఉంటాయి.

వీరి నిర్ణయాలకు కుటుంబ సభ్యులు మొదట అభ్యంతరాలు చెప్పినా తర్వాత అంగీకరిస్తారు.

ఒక చిరకాల మిత్రుని సుదీర్ఘకాలం తరువాత కలుసుకుని ఆనందంగా గడుపుతారు.

తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు.

వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా భరించాల్సి ఉంటుంది.

పెట్టుబడుల విషయంలో సందిగ్ధంలో పడతారు.

అయితే ద్వితీయార్థంలో కొంత ఊపందుకుంటాయి.

ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి, కానీ వాయిదా పడుతూ వస్తాయి.

పనిఒత్తిడులు తప్పవు.

వ్యవసాయదారులకు మొదటి∙పంట అనుకూలం.

పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగాల వారికి మిశ్రమంగా ఉంటుంది. కళాకారులు,క్రీడాకారులకు కొంత సానుకూల సమయమనే చెప్పాలి.

రాజకీయవేత్తలు ఊహించని విదేశీ పర్యటనలు చేయవచ్చు.

వ్యవహారాలలో గతంలోని కొన్ని తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు సాగడం ఉత్తమం.

జూలై – డిసెంబర్‌ మధ్య శని వక్ర సంచారం మరింత చికాకు పరుస్తుంది.

ఈ కాలంలో శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేయించుకుంటే ఉపశమనం పొందవచ్చు.

అదృష్టసంఖ్య–1, కెంపు ధరించాలి.

దుర్గాదేవిని ఆరాధించడం మంచిది.

01 జనవరి 2026 - 31 డిసెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

సింహం (23 జూలై నుండి 22 ఆగస్టు)

ఈతిబాధల నుంచి ఏదోలా గట్టెక్కుతారు.

ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు చాలావరకూ పరిష్కారమవుతాయి.

ఆప్తులు, బంధువులు మీ పట్ల ఆదరణ, ప్రేమ కనబరుస్తారు.

స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది.

ఏ కార్యక్రమం చేపట్టినా సకాలంలోనే పూర్తి చేసి ముందుకు సాగుతారు.

భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కారానికి నోచుకుంటాయి.

భవిష్యత్‌పై విద్యార్థులు పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి.

ఉద్యోగ ప్రయత్నాలు మరింత సానుకూలమవుతాయి.

ఆర్థిక పరిస్థితిలో పెనుమార్పులు ఉండవచ్చు. ఊహించని రీతిలో ధనలబ్ధి. పొదుపు బాటలో పయనిస్తారు.

వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు సమకూరడంతో పాటు భాగస్వాములు చేరతారు.

ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా సాగుతారు. మీపైస్థాయి అధికారులు మిమ్మల్ని ప్రశంశలతో ముంచెత్తుతారు.

రాజకీయవేత్తలు, కళాకారులు విశేష గుర్తింపు పొందుతారు. కొందరికి పదవులు దక్కవచ్చు.

వ్యవసాయదారుల కలలు నెరవేరే అవకాశాలున్నాయి..

ఐటీ రంగం వారు సొంత ఆలోచనలతో కొత్త ప్రయోగాలు చేస్తారు.

మహిళలకు పుట్టింటి వారి నుంచి లబ్ధి చేకూరే అవకాశం.

ఫిబ్రవరి, మార్చి,సెస్టెంబర్, నవంబర్, పతిబంధకాలు, ముఖ్యంగా మార్చి నెల కొంత జాగ్రత్తలు అవసరం. వివాదాలు, మానసిక అశాంతి. అత్యంత ఆప్తులతోనే విరోధాలు. ఖర్చులు విశేషంగా ఉంటాయి.

అదృష్టసంఖ్య–1.గులాబీ, , చాక్లెట్‌రంగులు అనుకూలం.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి