09 ఎప్రిల్ 2024 - 30 మార్చి 2025
జన్మ నక్షత్రం ప్రకారం

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)

ఆదాయం – 14, వ్యయం – 14, రాజపూజ్యం – 3, అవమానం – 1.

మే 1వ తేదీ నుండి గురుని పంచమకోణస్థితి అత్యంత శుభదాయకం. అలాగే, ఏల్నాటిశని నడుస్తున్నా మూర్తిమంతం చేత సువర్ణమూర్తి కావడం అనుకూలం. రాహుకేతువులు కూడా శుభకారకులే.

వీరు తలచిన ఏ పనీ కూడా జాప్యం లేకుండా పూర్తి కాగలదు.

ఆర్థిక విషయాలు మునుపటి కంటే మరింత మెరుగుపడి ఉన్నతికి చేరుకుంటారు. అయితే వివిధ రూపాలలో ఖర్చులు కూడా ఎదురవుతాయి.

ఇతరులకు చేయూతనివ్వడంలో ముందడుగు వేస్తారు.

సొంత ఆలోచనలే అమలు చేసి విజయాలు సాధిస్తారు.

వివాహాది శుభకార్యాలు, సంతాన సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి.

సోదరులు మీతో ఆస్తుల వ్యవహారంలో అంగీకారానికి వస్తారు.

విద్యార్థులకు విదేశీ విద్యలు, ఉద్యోగాలు దక్కుతాయి.

మీ మధ్యవర్తిత్వం కోసం బంధువులు ఎదురుచూస్తుంటారు.

ఎవరినీ నొప్పించని రీతిలో నిర్ణయాలు తీసుకుని ప్రశంసలు అందుకుంటారు.

ఇంటి నిర్మాణ కల నెరవేరే సమయం.

అలాగే, పెద్దవాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.

శని ప్రభావం వల్ల కొంత ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చు. అలాగే కొందరికి శస్త్ర చికిత్సలకు అవకాశం.

వ్యాపారస్తులు ఇబ్బడిముబ్బడిగా లావాదేవీలు నడిపించి లాభాలు పొందుతారు.

ఉద్యోగస్తులు బాధ్యతలు నిర్వహించడంలో అప్రమత్తత పాటించడం ద్వారా గుర్తింపు పొందుతారు.

శాస్త్ర సాంకేతిక వర్గాల వారు కొత్త పరిశోధనల ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తారు.

రాజకీయవేత్తలకు పదవీయోగం, న్యాయపరమైన వివాదాల నుండి విముక్తి.

పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఆత్మవిశ్వాసంతో కార్యాలను చక్కదిద్దుతారు.

కళాకారులకు అవకాశాలకు లోటు ఉండదు. కొందరికి అవార్డులు సైతం రావచ్చు.

వ్యవసాయదారులు రెండుపంటలూ అనుకూలించి ఉత్సాహంతో గడుపుతారు.

మహిళలకు మానసికంగా మరింత బలం చేకూరుతుంది.

చైత్రం, ఆషాఢం, ఆశ్వయుజ మాసాలు మినహా మిగతావి మరింత అనుకూలం.

వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామికి అర్చనలు చేయడం ఉత్తమం.

01 జనవరి 2024 - 31 డిసెంబర్ 2024
జన్మ తేది ప్రకారం

మకరం (23 డిసెంబర్ నుండి 22 జనవరి)

వీరు గతం కంటే మెరుగైన ఫలితాలు పొందే అవకాశం. ప్రతి పనిలోనూ విజయం సాధించేందుకు తగిన కృషి చేస్తారు.

బంధువులు, స్నేహితులతో కొద్దిపాటి విభేదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు.

సోదరీ, సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు.

కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ల వారు లక్ష్యసాధన దిశగా కదులుతారు.

వివాహాది శుభకార్యాల నిర్వహణపై ఒక అంచనాకు వస్తారు.

విద్యార్థులు కోరుకున్న ర్యాంకులు, ఫలితాలు సాధిస్తారు.

ఆరోగ్యం పై నిర్లక్ష్యం వీడాలి, ఆహార విహారాదులలో తగు జాగ్రత్తలు పాటించడం మంచిది.

దైవకార్యాలలో నిమగ్నమవుతారు.

వ్యాపారాలు, వాణిజ్యవర్గాలకు లాభాలు పెరుగుతాయి.

ఉద్యోగులు తమ విధులు చక్కదిద్దడంలో ఆటంకాలు అధిగమిస్తారు.

పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు పట్టింది బంగారమే అనే విధంగా ఉంటుంది.

కళాకారులు, రాజకీయవేత్తలకు సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి.

ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్‌ నెలలు కొంత చికాకు పరుస్తాయి. ఇంటాబయటా కలహాలు వంటి ఫలితాలు కనిపిస్తాయి.

అదృష్ట సంఖ్య–8

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి