30 మార్చి 2025 - 18 మార్చి 2026
జన్మ నక్షత్రం ప్రకారం
ఆదాయం - 8, వ్యయం - 2, రాజపూజ్యం - 7, అవమానం - 3
వీరికి మే 14వరకు గురుడు విశేషమైన యోగకారకుడు. తదుపరి అక్టోబర్18 వరకు ఖర్చులు, కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సంపాదన అంతా వివిధ రూపాల్లో ఖర్చులు చేయాల్సిన పరిస్థితి, ఆ తరువాత నవంబర్ 11 వరకు కర్కాటరాశిలో సంచారం శుభకరం. ఇది గురునికి ఉచ్ఛస్థితి కావడం కలిసివచ్చే అంశం.
ఇంతవరకూ ఇబ్బందులు పెట్టిన అష్టమ శని దోషం తొలగినా మే 19 నుండి అష్టమ రాహువు, కుటుంబ స్థానంలో కేతు సంచారం ప్రతికూలం. మొత్తానికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
రాబడి ఉన్నా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి.
చేపట్టిన వ్యవహారాలు నెమ్మదిస్తాయి.
ఎంతగా కష్టించినా ఫలితం ఆశించినస్థాయిలో ఉండదు.
ఆప్తుల ద్వారా వివిధ విషయాలపై ఒత్తిడులు ఎదుర్కొంటారు.
కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు అవకాశం.
సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.
ఇంటి నిర్మాణ యత్నాలు అక్టోబర్ నవంబర్ నెలలో అనుకూలిస్తాయి.
అష్టమ రాహు దోషం వల్ల వాహనాల విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తత అవసరం.
వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
అలాగే ఉదర, ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి.
ప్రథమార్థంలో బంధువుల హడావిడితో కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది.
నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.
అవివాహితులకు వివాహయోగం.
ఆస్తుల వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు.
కోర్టు కేసులో విజయం సాధిస్తారు.
వ్యాపారాలలో లాభాలు కొనసాగుతాయి.
ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు, స్వల్పంగా ఇంక్రిమెంట్లు రావచ్చు.
కొంత అదనపు బాధ్యతలు మీదపడి సతమతం కాగలరు.
పారిశ్రామికవర్గాలకు అనుకున్న కార్యాలలో అడ్డంకులు కొంత తొలగుతాయి.
రాజకీయవర్గాల వారికి మిశ్రమంగా ఉంటుంది.
కళాకారులు అనుకున్నది సాధించినా కొంత కష్టపడాలి.
విద్యార్థుల విదేశీ విద్యావకాశాల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి.
వ్యవసాయదారులలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
వీరు గురు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం మంచిది. నిత్యం హనుమాన్నామస్మరణ మంచిది.
అదృష్టసంఖ్య - 2
01 జనవరి 2025 - 31 డిసెంబర్ 2025
జన్మ తేది ప్రకారం
కొద్దిగా కష్టపడగలితే చేస్తున్న వృత్తి లో తప్పకుండా మీరనుకొన్న విజయాలు సాధిస్తారు.
అనుకోని ఖర్చులు అధికం గా ఉంటాయి, దీని వలన సమస్యలు ఆర్థికపరిస్థితి కొంత గందరగోళం గా తయారవుతుంది. ఎన్ని సమస్యలున్నా కుటుంబవ్యవహారాలు మీ బాధ్యతలు అన్ని కూడా ఆత్మవిశ్వాసం తో తట్టుకోగలుగుతారు.
ఎక్కువగా ఆవేశపడి సంబంధాలని పాడు చేసుకోకపోవడం మంచిది.
వీరు పాటించవలసిన సూచనలు రోడ్డు ప్రమాదాలు, గాయాలు, దెబ్బలు వంటి అవకాశాలు కలవు, కావున కొంత జాగ్రత్త వహించడం మంచిది.
ప్రతి విషయం లో మీ మాటే నెగ్గించుకోవాలనే మొండితనం విడిచిపెట్టడం మంచిది.
శనివారం రోజున శని గ్రహాన్ని పూజించడం మంచిది.
గురువారం రోజున రావి చెట్టు కి పసుపు పూసి పూజించడం.
ప్రతి నెల పౌర్ణమి రోజు చంద్రుడికి నీటి తో అర్ఘ్యం ఇచ్చి పూజించడం.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి











