
30 మార్చి 2025 - 18 మార్చి 2026
జన్మ నక్షత్రం ప్రకారం
ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 3
ఈ రాశి వారికి మే 15 నుండి గురువు అనుకూలిస్తాడు. శని, రాహు కేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు.
ఆదాయంతో పాటు, సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. మరోవైపు ఖర్చులు కూడా అధిగమించాల్సి వస్తుంది.
బంధువర్గం వారు సాయం అందించడంలో పాటు వారి నుండి ఒత్తిడులు కూడా పెరుగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి.
కుటుంబ సభ్యుల కంటే స్నేహితుల సాయమే ఎక్కువగా లభిస్తుంది.
ఆర్థికపరమైన హామీలకు మాత్రం దూరంగా ఉండడం మంచిది.
కుటుంబంలో సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తారు.
ఆరోగ్యపరమైన సమస్యలు సైతం చికాకు పరుస్తాయి.
ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు.
జీవిత భాగస్వామి తరఫు నుండి ఎంతో కొంత ధన లేదా ఆస్తి లాభం కలుగుతుంది.
వారసత్వ ఆస్తి కూడా లభించవచ్చు.
ఇంటి నిర్మాణయత్నాలు ప్రథమార్ధంలో పూర్తి కాగలవు.
వివాహాది శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు.
తరచూ తీర్థయాత్రలు, దైవదర్శనాలు చేస్తారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలతో పాటు కొద్దిపాటి ఆటుపోట్లు సైతం చూడాల్సి వస్తుంది.
ఉద్యోగస్తులకు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. ద్వితీయార్థంలో పదోన్నతులకు అవకాశం.
పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు, కొత్త సంస్థల స్థాపనకు శ్రీకారం.
రాజకీయవర్గాల వారు అనూహ్యమైన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
కళాకారులకు అవకాశాలు మరింతగా దక్కించుకుంటారు.
విద్యార్థులకు మంచి ఫలితాలు.
వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరతాయి.
ఏప్రిల్, జూలై, నవంబర్ నెలలు సామాన్యంగా ఉండవచ్చు.
వీరు తరచూ ఆంజనేయ స్వామికి అర్చనలు చేయడం ఉత్తమం.
అదృష్టసంఖ్య - 5
01 జనవరి 2026 - 31 డిసెంబర్ 2026
జన్మ తేది ప్రకారం
చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేయడంలో కొందరి సహాయం స్వీకరిస్తారు.
కొన్ని సందర్భాలలో రాజయోగం అనుభవిస్తారు. విలాసజీవితం గడుపుతారు.
చిత్రమైన రీతిలో దూరమైన వ్యక్తులు దగ్గరవుతారు..
మీ సహనానికి పరీక్షించేందుకు స్నేహితులు యత్నించి విఫలమవుతారు.
దృఢ చిత్తంతో ముందుకు సాగి విజయాలు సాదిస్తారు.
ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
బంధువులతో తరచూ విభేదాలు నెలకొన్నా సర్ది చెబుతారు..
విద్యార్థులు, నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. అయితే చివరి భాగంలో విశేషమైన ఫలితాలు అందుకుంటారు..
ఆస్తుల విషయంలో చేసుకున్న అగ్రిమెంట్లు చేసుకుని అడ్వాన్సులు చెల్లిస్తారు.
ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. రుణదాతల ఒత్తిడులు చాలావరకూ తొలగుతాయి.
తీర్థయాత్రలు విశేషంగా చేస్తారు..
సంఘం సేవలో భాగస్వాములవుతారు..
వ్యాపారస్తులు స్వీయ అనుభవాలతో సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపార సంస్థల ప్రారంభానికి సంసిద్ధులవుతారు.
ఉద్యోగస్తులు శ్రమ పెరిగినా తట్టుకుని తగిన గుర్తింపు పొందుతారు.
పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధించడంలో విజయం పొందుతారు.
వ్యవసాయదారులకు సామాన్యంగానే ఉంటుంది.
ఐటీ రంగం వారు పట్టుదలతో అప్పగించిన పనులు పూర్తి చేస్తారు.
మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురుకావచ్చు.
మే, జులై, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలలు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం , కుటుంబం, ఆర్థిక విషయాలు ఇబ్బందులు రావచ్చు. కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు. అదృష్టసంఖ్య–5, ఆకుపచ్చ, , కాఫీ రంగులు అనుకూలిస్తాయి.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి












