19 మార్చి 2026 - 06 ఏప్రిల్ 2027
జన్మ నక్షత్రం ప్రకారం

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆదాయం – 11, వ్యయం – 5, రాజపూజ్యం – 2, అవమానం – 4

వీరికి గురువు తృతీయమందు పాపి.

జూన్‌2వ తేదీ నుండి చతుర్ధ, ఉచ్చస్థానాల్లో గురుసంచారం అత్యంత శుభకరం.

ఇక శని వ్యయ స్థానంలో సంచారం వల్ల ఏలినాటి శని ప్రభావంతో కొన్ని వృథా ఖర్చులు చేయిస్తాడు.

అయితే మొత్తానికి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు.

ఇక రాహుకేతువులు డిసెంబర్‌5వ తేదీ వరకూ లాభ, పంచమ స్థానాల్లో సంచరించి 6వ తేదీ నుండి దశమ, చతుర్ధ స్థానాలలోకి ప్రవేశిస్తారు.

ఈ రీత్యా పరిశీలించగా జూన్‌ 6వ తేదీ నుండి శుభదాయకమే.

ఆర్థికంగా బలం చేకూరుతుంది.

కొన్ని అదనపు ఖర్చులు మీదపడొచ్చు.

సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు.

ఎంతటి వ్యవహారం అప్పగించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు.

వివాహం కాని వారికి జూన్నుండి వివాహయోగం కలుగుతుంది.

ఆస్తుల విషయంలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటీగా పరిష్కారమవుతాయి.

కొంత కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని కేసుల నుంచి విముక్తి లభిస్తుంది.

బంధువర్గం నుంచి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి.

ఇతరులకు సైతం చేయూతనిచ్చి మీ దాతృత్వాన్ని చాటుకుంటారు.

భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది.

ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్ధంలో ఫలిస్తాయి.

తరచూ ప్రముఖ తీర్థయాత్రలు చేస్తారు.

విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు వచ్చి ఆశ్చర్యపరుస్తాయి.

రాజకీయనేతలకు మధ్యలో ఇబ్బందులు నెలకొన్నా మొత్తం మీద అనుకూలమైన వాతావరణమే ఉంటుంది.

కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉండి ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు.

వ్యవసాయదారులకు రెండవ పంట లాభదాయకంగా ఉంటుంది.

ప్రభుత్వం నుంచి మరింత సాయం అందుకుంటారు.

వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉండి మొత్తానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది.

ఉద్యోగులకు ప్రమోషన్లు అందుకునే అవకాశాలున్నాయి.

అయితే వీరు కొన్ని బదిలీలకు సిద్ధంగా ఉండాలి.

క్రీడాకారులకు మొదట్లో కష్టకాలంగా ఉన్నా మధ్యకాలంలో ఎదురుండదు.

సాంకేతిక రంగం వారికి మరింత చేయూత లభిస్తుంది.

డిసెంబర్‌5 నుండి కేతువు అర్థాష్టమ స్థితి పొందినా ఉచ్చస్థితిలో గురునితో కలయిక వల్ల శుభదాయకమే.

ఏడాది మొదటి భాగంలో గురుబలం లోపించడం, వ్యయ శని కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులతో పాటు ఎంత సమకూరినా డబ్బు కనిపించని పరిస్థితి ఉంటుంది.

అలాగే, శని జూలై చివరి వారం - డిసెంబర్‌ మొదటి వారం మధ్య వక్రగతి సంచారం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు. మరిన్ని ఖర్చులు.

ఇతరులతో మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది.

సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ఉత్తమం.

మొత్తం మీద ఈ రాశి వారికి ద్వితీయార్థమే అనుకూలమని చెప్పొచ్చు.

వీరు ప్రథమార్ధంలో గురుని, డిసెంబర్‌ 5 తరువాత కేతువునకు పరిహారాలు చేయించుకోవాలి.

అదృష్టసంఖ్య–9, పగడం ధరించాలి.

సుబ్రహ్మణ్యారాధన మంచిది.

01 జనవరి 2026 - 31 డిసెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

మేషం (21 మార్చి నుండి 19 ఏప్రిల్)

కొన్ని అద్భుత ఫలితాలు ఈ సంవత్సరం చూస్తారు.

మధ్యమధ్యలో కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు వచ్చినా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు.

ఎవరికీ తలవంచక సొంత ఆలోచనలతోనే ముందుకు సాగుతారు.

తరచూ ప్రయాణాలు, తీర్థయాత్రలతో గడుపుతారు.

ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేసే వరకూ నిద్రపోరు.

ప్రధాన నిర్ణయాలపై తొందరపాటు వద్దు.

మిత్రులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు.

సమస్యల పరిష్కారంపై కొన్ని మీరు చేసే ప్రతిపాదనలకు అందరూ ఆమోదం తెలుపుతారు.

భార్యాభర్తల మధ్య ఎంతోకాలంగా నెలకొన్న వివాదాలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి.

కొన్ని కేసుల నుండి గట్టెక్కే కాలం.

ఆర్థికంగా బలం చేకూరినా కొన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి..

వ్యాపారాలలో లాభనష్టాలను సమానంగా స్వీకరించాల్సి వస్తుంది. విస్తరణలో కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు.

ఉద్యోగాలలో అనుకూల మార్పులు, విధి నిర్వహణలో ఎవరికీ తలవంచరు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రాజకీయవేత్తలకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే కొన్ని విదేశీ పర్యటనలు మాత్రం రద్దు చేసుకుంటారు..

వ్యవసాయదారులకు అనూహ్యంగా పెట్టుబడులు సమకూరతాయి.

విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు.

ఐటీ రంగం వారి శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.

మహిళలకు ఎన్నడూ లేని విధంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

మార్చి,మే. జూలై, అక్టోబర్, నవంబర్‌నెలలు చికాకులు, బంధువిరోధాలు. ఇంటాబయటా ఒత్తిడులు. తరచూ అనారోగ్యం. ముఖ్యంగా నవంబర్‌లో మరింత జాగ్రత్తలు పాటించాలి.

అదృష్టసంఖ్య–9, ఎరుపు, నేరేడు, బంగారు రంగులు కలిసివస్తాయి.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి