30 మార్చి 2025 - 18 మార్చి 2026
జన్మ నక్షత్రం ప్రకారం

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం - 2, వ్యయం - 14, రాజపూజ్యం - 5, అవమానం - 2

ఈ సంవత్సరం గురు, రాహువులతో పరీక్షా కాలంగా ఉంటుంది. మే 14 నుండి అక్టోబర్ 18 వరకు, తిరిగి నవంబర్ 11 నుండి అష్టమ గురు దోషం.

అలాగే, మే 19 నుండి సంవత్సరమంతా అర్థాష్టమ రాహు దోషం ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు లేకున్నా ఖర్చులు అధికమై సతమతం కాగలరు.

నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సైతం చేజారి నిరాశ చెందుతారు.

శుభకార్యాల రీత్యా ఖర్చులు విపరీతంగా ఉంటాయి.

మీ మాటకు కుటుంబంలో సానుకూలత రాకపోవచ్చు.

ప్రతి వ్యవహారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.

ఏ నిర్ణయమైనా ఆప్తుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం.

మిత్రులు, సన్నిహితులతో అకారణంగా వైరం.

వాహనాలు, భూములు కొనాలన్న ఆలోచన కలిగి ఆ దిశగా అడుగులు వేస్తారు. అయితే కష్టసాధ్యమైనా ప్రయత్నం ఫలిస్తుంది.

చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపడతారు.

అక్టోబర్ నవంబర్ మధ్య గురు బలం వల్ల ఆకస్మిక ధన లబ్ధి.

మానసిక ప్రశాంతత, పరిపూర్ణ ఆరోగ్యం సమకూరతాయి.

శాస్త్ర సాంకేతిక రంగాల వారుతమ ప్రతిభను చాటుకుంటారు.

వ్యాపారాలలో లాభనష్టాలను సమస్థాయిలో పొందుతారు.

కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు.

ఉద్యోగస్తులకు విధుల్లో కొన్ని అవాంతరాలు వచ్చిన అధిగమిస్తారు.

కొన్ని బదిలీలు నిలిచిపోయే అవకాశం ఉంది.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు, కొత్త సంస్థలకు అనుమతుల కోసం యత్నిస్తారు.

రాజకీయవర్గాలకు సరైన గుర్తింపు దక్కవచ్చు.

కళాకారులకు అనుకోని అవకాశాలు కొంత ఊరటనిస్తాయి.

విద్యార్థుల యత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి.

వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది.

గురుని అష్టమ స్థితి, రాహువు అర్థాష్టమ స్థితి వల్ల మానసిక ఆందోళన, చికాకులు. ఇతరులతో మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది.

వీరు కనకధారా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

అదృష్ట సంఖ్య - 9.

01 జనవరి 2026 - 31 డిసెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

వృశ్చికం (23 అక్టోబర్ నుండి 22 నవంబర్)

పట్టుదల వీడకుండా ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కొంటారు.

కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.

మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం..

ఒక వ్యక్తి ఊహించని రీతిలో సహాయం అందించేందుకు ముందుకు వస్తారు.

ముఖ్య వ్యవహారాలు అనుకున్న తడవుగా పూర్తి చేస్తారు.

ప్రముఖుల పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

నిరుద్యోగులు తమ కృషికి తగిన ఫలితం పొందుతారు.

అయితే ద్వితీయార్థంలో శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి.

జీవిత భాగస్వామితో తరచూ వివాదాలు ఇబ్బందిగా మారినా ఓర్పుతో పరిష్కరించుకుంటారు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లు గతం కంటే మరింత రాణిస్తారు. లాభాల బాట పడతారు.

ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పర్చినా ఎప్పటికప్పుడు సర్దుబాటు కాగలవు.

వ్యాపారాలలో క్రమేపీ లాభాలు అందుతాయి. భాగస్వాములు మీ పనితీరుని గుర్తిస్తారు.

ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు, అలాగే, మీ పనితీరుపై ప్రశంసలు అందుకుంటారు.

రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ు ఉత్సాహవంతంగా ఉంటుంది.

వ్యవసాయదారులకు రెండవ పంట సానుకూలమవుతుంది.

ఫిబ్రవరి, మే, జూన్, అక్టోబర్, డిసెంబర్, నెలల్లో ఈతిబాధలు, శ్రమాధఇక్యం. శారీరక రుగ్మతలు. కొన్ని ఆస్తు ల తగాదాలు. ఖర్చులు అధికం.

అదృష్టసంఖ్య–9, ఎరుపు, గులాబీ, నేరేడు రంగులు అనుకూలం.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి