
30 మార్చి 2025 - 18 మార్చి 2026
జన్మ నక్షత్రం ప్రకారం
ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం - 1
వీరికి జన్మరాశిలో శని సువర్ణమూర్తి కావడం, రాహువు, కేతువులు కూడా సువర్ణమూర్తులుగా సంచారం, మే 14 తరువాత గురువు ప్రభావంతో అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి.
ఈ ఏడాది ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండానే సర్దుబాటు కాగలదు. అప్పులు చేసినా వెనువెంటనే తీరుస్తారు.
ఇష్టమైన వ్యక్తులు మరింత దగ్గరవుతారు.
తీర్థ యాత్రలు విరివిగా చేసి ఆధ్యాత్మికతను పెంచుకుంటారు.
సంవత్సర ప్రారంభంలో కొన్ని సమస్యలు, కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా మనోబలంతో అధిగమిస్తారు.
అలాగే, ఆరోగ్యం కొంత సహకరించక ఇబ్బంది పడతారు. అయితే త్వరగానే స్వస్థత చేకూరుతుంది. చేసే పనిపై ఏకాగ్రత కలిగి సమయానికి పూర్తి చేస్తారు.
ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు.
బలమైన ప్రత్యర్థులు కూడా మీ మంచితనానికి విధేయులై మసలుకుంటారు.
కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు.
ఉద్యోగార్ధులు తమ ప్రయత్నాలలో సఫలం చెందుతారు.
వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
అలాగే, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సన్నద్ధమవుతారు.
సోదరులు, సోదరీల నుంచి శుభవార్తలు అందుతాయి.
కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ద్వితీయార్థంలో మరింత లబ్ధి పొందుతారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త పెట్టుబడులు అంది ముందడుగు వేస్తారు.
సంస్థలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తారు.
ఉద్యోగులకు ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు. పై స్థాయి నుంచి ప్రోత్సాహం ఉంటుంది.
రాజకీయవర్గాలకు ప్రజాదరణ పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలతో గడుపుతారు.
కళాకారులకు అవకాశాలతో పాటు విజయాలు వరిస్తాయి.
విద్యార్థులకు శ్రమానంతరం మంచి ఫలితాలు రాగలవు.
వ్యవసాయదారులు రెండవ పంటలో లాభాలు పొందుతారు.
వీరు శని, రాహు, ప్రథమార్థంలో గురువు కి పరిహారాలు చేయాలి. నృసింహ స్తోత్రాలు పఠనం మంచిది.
అదృష్ట సంఖ్య - 3.
01 జనవరి 2026 - 31 డిసెంబర్ 2026
జన్మ తేది ప్రకారం
కొన్ని వ్యవహారాలలో దిగ్విజయయాత్రలు చేస్తారు.
ఆత్మీయుల ద్వారా మీ అంచనాల మేరకు సహాయం అందుతుది.
మొత్తానికి మీకు ఎదురులేని పరిస్థితి అనే చెప్పాలి.
ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత కలసివస్తుంది..
ఏనిర్ణయంలోనూ వెనుకడుగు వేయరు.
అప్పగించిన పనులు సమర్థవంతంగా నిర్వహించి ప్రతిభ చాటుకుంటారు.
కుటుంబంలో వివాహ వేడుకలు నిర్వహిస్తారు.
సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది..
భార్యాభర్తల మధ్య ఎడబాటు తొలగుతుంది.
ఆస్తుల వ్యవహారంలో ఒడిదుడుకులు అధిగమిస్తారు..
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి.
వ్యాపారస్తులు ఉత్సాహంగా ముందుకు సాగి లాభాలు అందుకుంటారు.
ఉద్యోగస్తులకు హోదాలు సంతృప్తినిస్తాయి. పైస్థాయి అధికారుల మనస్సులను గెలుచుకుంటారు.
వైద్యులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. ఏడాది చివరిలో మరిన్ని విజయాలు సాధిస్తారు.
వ్యవసాయదారులు పెట్టుబడులు సమీకరణలో సఫలమవుతారు.
ఐటీ రంగం వారు పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు.
మహిళలకు ఈతిబాధలు తొలగుతాయి.
ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్, వ్యతిరేకఫలాలు ఉండవచ్చు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువర్గంతో తగాదాలు చోరభయం. మానసికంగా ఆందోళన. ఆరోగ్యం ఇబ్బంది కలిగించవచ్చు.
అదృష్టసంఖ్య–3, గులాబీ, ఆకుపచ్చ, అనుకూలం.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి












