09 ఎప్రిల్ 2024 - 30 మార్చి 2025
జన్మ నక్షత్రం ప్రకారం

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం – 2, వ్యయం – 8, రాజపూజ్యం – 7, అవమానం – 3.

వీరికి గురుడు మినహా మిగతా గ్రహాలు సానుకూలమై కనిపిస్తున్నాయి.

అయితే మే 1 నుండి జన్మరాశిలో గురు సంచారం వల్ల ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచిస్తారు.

మనస్సు చంచలంగా ఉంటుంది.

వ్యయం ఎక్కువగా కనిపించినా ఆదాయానికి ఇబ్బందులు రావు.

అలాగే, ఏప్రిల్‌లోగా శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉండవచ్చు.

గురు ప్రభావం వల్ల స్థాన మార్పులు, శారీరక అలసట, మానసిక అశాంతి. ఉండవచ్చు.

ఇక లాభస్థానంలో రాహువు సంచారం విశేష లాభదాయకం.

అనూహ్యంగానే కార్యక్రమాలు పూర్తి కాగలవు.

శత్రువులు కూడా మీవైపునకు ఆకర్షితులవుతారు.

న్యాయపరమైన చిక్కులు తొలగి ఊరట లభించే సమయం.

గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత నష్టం కలిగినా ఈ ఏడాది పూడ్చుకుంటారు.

భార్యాపుత్రులు, సోదరుల ద్వారా విశేష ప్రేమాదరణలు లభిస్తాయి.

యుక్తి, మనోనిబ్బరంతో కష్టనష్టాలను అధిగమిస్తూ నిలబడతారు.

దైవకార్యాలు, ఇతర సమాజసేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.

మీ చేతులు మీదుగా ఒక సత్కార్యం జరగాల్సిన సమయం.

ఇంట్లో శుభకార్యాలకు సన్నద్ధమవుతారు.

విద్యార్థులు మేథస్సుతో ఉన్నత విద్యలలో ప్రవేశిస్తారు.

ఫలితాలు కూడా అనుకూలం.

వ్యాపారస్తులు విరివిగా లాభాలు గడించి సంస్థల వికేంద్రీకరణకు సిద్ధపడతారు.

ఉద్యోగస్తులు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా బెదరక సజావుగా నిర్వహిస్తారు.

ఎన్నడో నిలిచపోయిన ఇంక్రిమెంట్లు లేదా పదోన్నతులు దక్కవచ్చు.

పారిశ్రామికవేత్తలు, వైద్యరంగాల వారికి మరింత ప్రోత్సాహం, సహకారం లభిస్తాయి.

రాజకీయవేత్తలు కొంత కష్టపడ్డాక ఫలితం పొందుతారు.

శాస్త్రసాంకేతిక వర్గాల వారు అద్భుత ఆవిష్కరణలతో ప్రశంసలు అందుకుంటారు.

వ్యవసాయదారులకు అదికంగా పంటలు పండి అప్పులు తీరుస్తారు.

మహిళలకు సంవత్సరమంతా సానుకూలమే.

జ్యేష్ఠం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాలు మినహా మిగతావి శుభదాయంగా ఉంటాయి.

వీరు గురునికి పరిహారాలు చేసుకోవాలి. సెనగల దానం మంచిది.

01 జనవరి 2025 - 31 డిసెంబర్ 2025
జన్మ తేది ప్రకారం

వృషభం (20 ఏప్రిల్ నుండి 20 మే)

శుభ అశుభ ఫలితాల మిశ్రమం గా ఉంటుంది.

కొన్ని సందర్భాలలో సమస్యలు ఎదురైనప్పటికీ అలాగే పనులలో అవాంతరాలు ఎదురైనా ఎదురుకొని నిలబడగలుగుతారు.

ముఖ్యం గా ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదురుకోవలసి వస్తుంది. ఈ విషయం గమనించుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఖర్చులు నియంత్రణ లో ఉంచుకొని ఆచి తూచి ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది. ముఖ్యంగా షేర్లు స్పెక్కులేషన్స్ కి దూరంగా ఉండాలి.

చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా పెద్దగా బాధించవు.

మార్చ్ తర్వాత నుండి కొద్దిగా సమస్యల నుండి బయటపడగలిగే మార్గాలు కనబడతాయి.

భవిష్యత్తు గురించి ఆలోచనలు అధికమవుతాయి.

వీరు పాటించాల్సిన సూచన ఏమిటంటే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ముఖ్యం గా దూరప్రయాణాలు.

కోపాన్ని నియంత్రించుకొని, శాంతంగా ఉండే ప్రయత్నాలు చేయాలి.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి