09 ఎప్రిల్ 2024 - 30 మార్చి 2025
జన్మ నక్షత్రం ప్రకారం
ఆదాయం – 2, వ్యయం – 14, రాజపూజ్యం – 2, అవమానం – 2.
వీరికి గురువు దశమ స్థానంలో సంచారం గోచారరీత్యా ప్రతికూలమైనప్పటికీ మూర్తిమంతంచేత శుభదాయకుడు.
సప్తమ శని, అష్టమ రాహువు, ద్వితీయ కేతువులు దోషకారులే.
మొత్తానికి వీరికి ద్వితీయార్థంలో గురు ప్రభావం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ఆర్థికంగా కొంత కూడబెట్టినా ఏదో ఖర్చు ఎదురవుతునే ఉంటుంది.
పొదుపు చేయాలన్న కోరిక ఫలించదు.
నమ్మినవారే మిమ్మల్ని వంచించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎవరి విషయాలలోనూ జోక్యం చేసుకోకుండా మీ జీవనం సాగించడం ఉత్తమం.
కుటుంబంలో కొన్ని సమస్యలు నెలకొని అగ్నిపరీక్షగా మారవచ్చు.
అయితే గురుడు కొంత యోగాన్నిస్తాడు . కొన్ని ఇబ్బందుల నుండి గట్టెక్కే ఉపాయం తడుతుంది.
ఇక ఆస్తులు కొనుగోలుకు ఎంతోకాలంగా చేస్తున్న యత్నాలు కలిసివస్తాయి.
రాహు ప్రభావం వల్ల ఆరోగ్యం ముఖ్యంగా నరాలు, ఎముకలు, చర్మ సంబంధింత వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు. పెద్ద వైద్యులను సంప్రదిస్తారు.
నేర్పు,సహనం, పట్టుదలే మీకు ప్రధానాస్త్రాలుగా ఉపయోగపడతాయి.
కొన్ని కష్టాలు ఎదురయ్యే సమయానికి ఆపద్బాంధువుడిలా ఒకరు సాయం అందిస్తారు.
ఎవరేమన్నా మౌనమే సమాధానం కావాలి.తొందరపాటు వద్దు.
వ్యాపారస్తులు కొంతమేర లాభాలు గడించినా అవి పెట్టుబడులకే సరిపోతాయి.
ఉద్యోగస్తులకు విధి నిర్వహణ మొదట్లో కష్టమైనప్పటికీ క్రమేపీ దూసుకుపోతారు. ఇంక్రిమెంట్లు విషయంలో ఇబ్బందులు.
పారిశ్రామికవేత్తలు, వైద్యులకు కొన్ని వ్యవహారాలు ఎట్టకేలకు సానుకూలమవుతాయి.
కళాకారులు కొన్ని అవకాశాలను పెండింగ్‌లో పెడతారు.
విద్యార్థులు మరింత కష్టపడితే అనుకున్నది సా«ధిస్తారు.
వ్యవసాయదారులు రెండవ పంటను పుష్కలంగా పొందుతారు.
మహిళలు ఆత్మవిశ్వాసం పెంచుకుని ముందడుగు వేయడం మంచిది.
ఆశావాదంతో ముందుకు సాగుతారు.
చైత్రం, వైశాఖ మాసాలు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిగతావి సామాన్యంగా ఉంటాయి.
వీరు గురు, శని, రాహు,కేతువులకు పరిహారాలు చేయాలి.
శ్రీ నృసింహ స్తోత్రాలు పఠనం ఉపయుక్తంగా ఉంటుంది.
01 జనవరి 2024 - 31 డిసెంబర్ 2024
జన్మ తేది ప్రకారం
కొన్ని సమస్యలను ఆత్మవిశ్వాసం, మరింత ఓర్పుతో పరిష్కరించుకుంటారు.
మీ సత్తా అందరిలోనూ చాటుకునేందుకు తగిన సమయమిదే.
కొందరు అవాంతరాలు కల్పించినా ముఖ్య వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
ప్రముఖుల నుండి మీకు సరైన గుర్తింపు, ఆహ్వానం అందుతుంది.
నిరుద్యోగులు తమ కృషికి తగిన ఉద్యోగం సాధిస్తారు.
ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు, వైద్యుల సలహాలు పొందాల్సిన అవసరం రావచ్చు. ఖర్చులు కూడా కొంత అధికం కావచ్చు.
భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు.
కాంట్రాక్టర్లు గతం కంటే అనుకూలమైన సమయం.
ఆర్థికంగా ఇబ్బందులను అధిగమిస్తూ, కొన్ని సర్దుబాట్లతో గడుపుతారు.
వ్యాపారులు పెట్టుబడులు పెరిగి క్రమేపీ లాభాలు అందుకుంటారు.
ఉద్యోగాలలో ఊహించని బదిలీలు ఉండవచ్చు. అయితే మీ పనితీరు పై కూడా ప్రశంసలు రావచ్చు.
రాజకీయవేత్తలు, కళాకారులు, ఐటీ నిపుణులకు గతంతో పోలిస్తే మెరుగైన కాలం.
విద్యార్థులు అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగుతారు.
వ్యవసాయదారులకు రెండవ పంట సానుకూలమవుతుంది.
ఫిబ్రవరి, మార్చి, జూలై, నవంబర్ నెలల్లో కొంత మందకొడిగా ఉంటుంది.
అదృష్ట సంఖ్య–1
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి