30 మార్చి 2025 - 18 మార్చి 2026
జన్మ నక్షత్రం ప్రకారం
ఆదాయం - 11, వ్యయం - 5, రాజపూజ్యం - 2, అవమానం - 2
వీరికి మే14 నుండి అష్టమ గురు దోషం తొలగిపోనుంది. ఇక అంతా మంచిరోజులే.
ప్రధాన గ్రహాలైన గురు, శని అనుకూల సంచారం శుభదాయకం. ఇక రాహు, కేతువులు సామాన్య ఫలితాలు ఇస్తారు.
మొత్తానికి గతం కంటే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా పరిపుష్ఠి సాధిస్తారు.
ఇతరుల వద్ద నిలిచిపోయిన ధనం చేతికందుతుంది.
స్థిరాస్తులు సైతం సమకూరతాయి.
ముఖ్యంగా తండ్రి ద్వారా రావలసిన ఆస్తులు దక్కవచ్చు.
కుటుంబంలోనూ ప్రశాంతత చేకూరుతుంది.
సుదీర్ఘకాలంగా భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగి సమన్వయంతో ముందుకు సాగుతారు.
సంతాన విషయంలో మీ అంచనాలు నిజం కాగలవు.
శత్రువులుగా మారిన బంధువులు కొందరు తప్పిదాన్ని తెలుసుకుంటారు.
వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.
కొన్ని సమస్యలు వాటంతట అవే తీరి ఊరట చెందుతారు.
సమాజంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు.
వాహన, గృహ యోగాలు కలుగుతాయి.
కాంట్రాక్టర్లకు మరిన్ని టెండర్లు దక్కవచ్చు.
తరచూ తీర్థ యాత్రలు చేస్తారు.
వ్యాపార, వాణిజ్యవేత్తల ఆశలు ఫలిస్తాయి. విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.
ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. పై స్థాయి వారి సహకారం అందుతుంది.
పారిశ్రామికవర్గాలకు చిక్కులు తొలగనున్నాయి. వీరికి ఒక అవకాశం ఊహించని రీతిలో రానుంది.
రాజకీయ నాయకులు గతం కంటే మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆశయాలు ఫలించే శుభకాలం.
విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు.
వ్యవసాయదారులకు నూతనోత్సాహం.
శాస్త్ర సాంకేతిక రంగాల వారు పరిశోధనల్లో విజయాలు సాధిస్తారు.
మే వరకూ ఆరోగ్య, కుటుంబ సమస్యలు, వృథా ఖర్చులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో గురునికి పరిహారాలు చేయించుకోవాలి.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం మంచిది.
వీరు నిత్యం ఆంజనేయ దండకం పఠించడం ఉత్తమం.
అదృష్ట సంఖ్య - 6.
01 జనవరి 2025 - 31 డిసెంబర్ 2025
జన్మ తేది ప్రకారం
ఉద్యోగస్తుల శ్రమని పనితనాన్ని పై స్థాయి వారు గుర్తిస్తారు, అందరి దగ్గర ప్రశంసలు అందుకొంటారు.
ఎంత వేగం గా ప్రశంసలు అందుకొంటారో ఎక్కువ కాలం దీనిని ఆస్వాదించలేకపోతారు.
ఎవరు ఏ వృత్తి లో ఉన్నా సవాళ్లు ఎదురుకోవలసి వస్తుంది.
వీరి జీవితం లో ఈ సమయం లో చాలా మార్పులకి అవకాశం కలదు, మంచి చెడుల మిశ్రమం గా ఈ మార్పులు ఉంటాయి.
పెట్టుబడుల విషయం లో జాగ్రత్త వహించాలి, రిస్క్ చేయడం తొందరపడటం మంచిది కాదు.
సంవత్సరం ఆఖరు లో మీరు చేస్తున్న పనులలో విజయం సాధిస్తారు.
సంబంధ బాంధవ్యాలు విషయం లో కొంత చికాకులు తప్పవు.
ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొనేటప్పుడు తండ్రి సలహా కానీ లేక మీరు గురువు గా భావించే వారు పెద్దగా భావించే వారి సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యం గా పాటించవలసిన సూచనలు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ఎటువంటి సందర్భాలలో ఓర్పు ని కోల్పోకండి.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి











