09 ఎప్రిల్ 2024 - 30 మార్చి 2025
జన్మ నక్షత్రం ప్రకారం
ఆదాయం – 14, వ్యయం – 14, రాజపూజ్యం – 6, అవమానం – 1.
వీరికి ఆదాయవ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి.
గురువు మే 1వ తేదీ నుండి చతుర్ధంలో సంచారం వల్ల ఆర్ఖికంగా బలపడడానికి కఠోర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది.
శని జన్మరాశి సంచారం మానసిక ఒత్తిడులు, వ్యయప్రయాసలు కలిగిస్తుంది.
అలాగే, రాహు కేతువులు కూడా సామాన్యమైన ఫలితాలే ఇస్తారు.
ఈరీత్యా వీరు ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం.
తల్లి లేదా ఆమె తరపు వారితో విరోధాలు.
విద్యార్థులకు శ్రమానంతరం అనుకూల ఫలితాలు రావచ్చు.
ఉద్యోగార్దుల యత్నాలు కొలిక్కి వచ్చే సమయంలో న్యాయపరమైన ఆటంకాలు ఎదురవుతాయి.
అయితే శని శ్రమానంతరం కొన్ని అనుకూల ఫలాలు ఇస్తాడు.
ఉన్నత హోదాల వారితో పరిచయాలను పెంచుకుంటారు.
పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్థంలో నెరవేరతాయి.
ఈ రాశి వారికి ఏల్నాటి శని వివాహయత్నాలు సానుకూలం చేస్తాడు.
కుటుంబంలో మాటల తొందరపాటు కాకుండా సంయమనంతో మెలగడం ఉత్తమం.
కొన్ని వ్యవహారాలు మీరే స్వయంగా పూర్తి చేస్తారు.
ఆరోగ్యపరమైన సమస్యలతో వైద్యసలహాలు పొందుతారు.
బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించండి.
ఒక సందర్భంలో కాస్త సమస్యలు, ఇబ్బందులు ఎదురై కుదుపునకు గురవుతారు. అయితే ఆత్మబలమే మీకు తోడ్పడుతుంది.
శాస్త్రసాంకేతిక వర్గాల కృషి ఫలించి ఉన్నతికి చేరుకుంటారు.
వ్యాపారస్తులు క్రమేపీ లాభాల బాటపడతారు. పెట్టుబడులు, భాగస్వాములు కూడా పెరుగుతారు.
ఉద్యోగస్తులకు బదిలీ సూచనలు, ద్వితీయార్థంలో విశేష గుర్తింపు లభిస్తుంది.
పారిశ్రామికవేత్తలు, వైద్యులు సేవలు విస్తృతం చేసి సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
రాజకీయవేత్తలకు పదవులు దక్కినా కొంత అసంతృప్తితోనే గడుపుతారు.
కళాకారులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు.
వ్యవసాయదారులకు రెండోపంట కలసివస్తుంది.
మహిళలకు మనోనిబ్బరం పెరిగి తదనుగుణంగా ముందుకు సాగుతారు.
చైత్రం, ఆషాఢం, భాద్రపద మాసాలు తప్ప మిగతావి సానుకూలం.
వీరు శనీశ్వరునికి, రాహుకేతువులకు పరిహారాలు చేయాలి.
01 జనవరి 2024 - 31 డిసెంబర్ 2024
జన్మ తేది ప్రకారం
మీ కృషి, పట్టుదలతో క్లిష్టమైన కార్యాలను సైతం పూర్తి చేస్తారు.
ఖరీదైన వస్తువులు, వాహనాలు కొంటారు.
రాబడి అనూహ్యంగా పెరిగి ఉత్సాహంగా అడుగులేస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి.
జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదుటపడి మనశ్శాంతి పొందుతారు.
రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లు ఎట్టకేలకు లాభాలు దక్కించుకుంటారు. కొన్ని కేసుల నుంచి బయటపడే అవకాశం. ఇతరులు చేసిన పొరపాట్లు మీపై మోపేందుకు యత్నిస్తారు. అప్రమత్తతతో మెలగాలి.
ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించడం మంచిది.
వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు లాభాలు కనిపిస్తాయి.
పారిశ్రామిక, రాజకీయవేత్తలు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.
కళాకారులకు ద్వితీయార్ధం నుండి మరిన్ని అవకాశాలు రాగలవు.
విద్యార్థులు, క్రీడాకారులకు అనూహ్యమైన విజయాలు.
జనవరి, మే, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు సాధారణ స్థాయిలో ఉంటాయి.
అదృష్ట సంఖ్య–8
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి