
30 మార్చి 2025 - 18 మార్చి 2026
జన్మ నక్షత్రం ప్రకారం
ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 6, అవమానం - 6
ఈ సంవత్సరం విశేష గురు బలంతో విజయాల బాటలో దూసుకువెళతారు.
సప్తమంలో శని కొంత ప్రతికూలం కాగా, షష్టమంలో రాహువు, వ్యయంలో కేతువు ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. మొత్తానికి వీరు ఎదురులేని విధంగా గడుపుతారు.
ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి సాధిస్తారు.
ఒకరి ద్వారా ఆశలు వదులుకున్న ధనం కూడా అందుతుంది.
కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పులకు అవకాశం.
మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు ఆచరిస్తారు.
కొన్ని సమస్యలు వీడి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ఆస్తులు కొనుగోలులో ముందుంటారు.
ఈ ఏడాది గృహ యోగం, వివాహాది శుభకార్యాల నిర్వహణ వంటి వాటికి ఖర్చు చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.
విద్యార్థులు ఊహించని ర్యాంకులు సాధిస్తారు.
వ్యాపార, వాణిజ్యరంగాల వారికి ఇతోధికంగా లాభాలు రాగలవు.
అలాగే, భాగస్వాములతో వివాదాలు తీరతాయి.
ఉద్యోగులకు తాము ఊహించిన దానికంటే అధికంగా లబ్ధి చేకూరుతుంది.
పారిశ్రామికవర్గాల నూతన ప్రాజెక్టులు చేపడతారు.
ఐటీ నిపుణులకు చెప్పుకోతగిన మార్పులు ఉంటాయి.
రాజకీయవేత్తలకు పదవులు రావచ్చు.
కళాకారులు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.
వ్యవసాయదారుల ఆశలు నెరవేరతాయి.
అయితే సప్తమ శని, వ్యయంలో కేతువు ప్రభావం వల్ల చర్మ, నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు.
అలాగే, భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు నెలకొంటాయి. తొందరపాటు మాటలు లేకుండా, ఆచితూచి వ్యవహరిస్తూ సాగడం మంచిది.
మే 18 వరకు ప్రయాణాలు, ఇతర ముఖ్య వ్యవహారాలలో మరింత జాగ్రత్తలు పాటించాలి. మిగతా నెలలు అనుకూలమే.
వీరు శని, కేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. శ్రీ దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు పఠించండి.
అదృష్ట సంఖ్య - 5.
01 జనవరి 2026 - 31 డిసెంబర్ 2026
జన్మ తేది ప్రకారం
అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు వచ్చినా పట్టువీడని విక్రమార్కుడిగా ఎట్టకేలకు పూర్తి చేస్తారు.
ప్రముఖులు పరిచయమై సహాయపడతారు.
విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకునేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి.
స్థిరాస్తి వివాదాలు క్రమేపీ పరిష్కారమవుతాయి.
ద్వితీయార్థమంతా శుభకార్యాల నిర్వహణ, హడావిడితో గడుపుతారు.
సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.
కొన్ని కేసుల నుండి బయటపడేందుకు అవకాశాలున్నాయి..
కాంట్రాక్టుల విషయంలో అనుకున్నది సాధిస్తారు.
తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు.
వ్యాపారాలు ప్రథమార్థంలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి లాభాల బాటపడతారు.
ఉద్యోగాలలో జరిగే మార్పులు మీకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఉన్నతాధికారులు కూడా మీ పనితనాన్ని మెచ్చుకుని అభినందనలు చెప్పడం విశేషం.
క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు తమ ప్రతిభ చాటుకుంటారు.
వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరతాయి..
ఐటీ రంగం వారు కొత్త నైపుణ్యాలు చూపుతారు.
మహిళలకు స్థిరాస్తి లాభాలు ఉండవచ్చు.
మార్చి, ఏప్రిల్, ఆగస్టు,అక్టోబర్, డిసెంబర్, అన్ని విషయాలలోనూ అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబంపై దృష్టి పెట్టాలి.
అదృష్టసంఖ్య–5, పసుపు, బంగారు రంగులు అనుకూలం.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి












