30 మార్చి 2025 - 18 మార్చి 2026
జన్మ నక్షత్రం ప్రకారం

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 1, అవమానం - 5.

కొన్ని సమస్యలు ఎదురైనా కఠోర శ్రమ, చాకచక్యంగా అధిగమిస్తారు.

మనోబలమే వీరికి ఆయుధం. ఏ మాత్రం దిగాలు చెందక దీక్షగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు.

వీరికి అర్థాష్టమ శనితో పాటు, అక్టోబర్ నవంబర్ మధ్య అష్టమ గురువు దోషకారులు.

రాహు,కేతువులు శుభదాయమైన ఫలితాలు ఇస్తారు శని, అష్టమ గురుడు ఆరోగ్యం పై ప్రభావం చూపుతారు. ఆయా కాలాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం మంచిది.

అలాగే, నేత్ర, ఉదర, హృదయ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు.

పేరుప్రతిష్ఠలకు కూడా భంగం కలుగుతుంది.

ఎవరినీ అతిగా విశ్వసించకుండా దైవం పై భారం మోపి ముందుకు సాగడం మంచిది.

ప్రయాణాల్లోనూ విలువైన వస్తువులు చేజారే వీలుంది.

కుటుంబంలో సమస్యలు పెరిగి సవాలుగా నిలుస్తాయి.

కొన్ని వ్యవహారాలలో పట్టువిడుపు ధోరణి మంచిది.

ఇక డిసెంబర్ నుండి గురువు శుభఫలితాలు ఇస్తాడు.

ఆదాయం పెరిగి అవసరాలకు లోటు రాదు. అలాగే, మానసిక ప్రశాంతత, ఒడిదుడుకుల నుండి విముక్తి లభిస్తుంది.

ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి.

వ్యాపార, వాణిజ్య రంగాలలో లాభనష్టాలను సమానంగా స్వీకరించాల్సి వస్తుంది. అయితే పెట్టుబడుల అన్వేషణ ఫలిస్తుంది. భాగస్వాముల చేయూతతో సమస్యలు తీరతాయి.

ఉద్యోగస్తులకు పని భారం మరింతగా పెరిగినా కొంత కీర్తి కూడా దక్కుతుంది. అయితే సంవత్సరాంతంలో పదోన్నతులు దక్కవచ్చు.

పారిశ్రామికవర్గాలకు చేసే యత్నాలు ముందుకుసాగని పరిస్థితి. అధికారుల నుండి సమస్యలు రావచ్చు.

రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి నెలకొన్నా గౌరవానికి లోటు రాదు.

కళాకారులు అనుకున్న అవకాశాలు సాధించేందుకు శ్రమపడాలి.

విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.

వ్యవసాయదారులకు ద్వితీయార్థంలో అనుకూల స్థితి.

వీరు శని, గురువులకు తగిన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి.

రుద్రాభిషేకాలు చేయించుకుంటే మంచిది.

అదృష్ట సంఖ్య - 3.

01 జనవరి 2025 - 31 డిసెంబర్ 2025
జన్మ తేది ప్రకారం

ధనుస్సు (23 నవంబర్ నుండి 22 డిసెంబర్)

మొదట్లో వృత్తికి సంబందించిన ఒడిదుడుకులు ఉంటాయి, రకరకాల సమస్యల్ని ఎదురుకోవలసి వస్తుంది.

సమస్యల వలయంలా కనిపిస్తుంది, అయినప్పటికీ ముందు జాగ్రత్త గా ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేయవలసి ఉంటుంది.

స్థిరాస్తులు కొనే అవకాశాలు లభిస్తాయి, ఆర్ధికం గా మంచి అభివృద్ధి ఉంటుంది.

మే తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయి.

ఉద్యోగస్తులు అత్యుత్తమ ప్రతిభ ని కనబరుస్తారు.

వ్యాపారస్తులు అన్ని సందర్భాలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.

క్రమం గా సమయం గడిచే కొద్దీ అన్ని వ్యవహారాలలో మంచి మార్పులు వచ్చి అన్నిట్లోనూ మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి.

సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

ముఖ్యం గా పాటించవలసిన సూచనలు - ఆరోగ్య విషయం లో జాగ్రత్త గా వ్యవహరించాలి.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి