19 మార్చి 2026 - 06 ఏప్రిల్ 2027
జన్మ నక్షత్రం ప్రకారం

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం – 5, వ్యయం – 14, రాజపూజ్యం – 6, అవమానం – 3

వీరికి సంవత్సరమంతా గురువు అనుకూలుడు.

జూన్‌1వరకు భాగ్యస్థానం, తదుపరి దశమ స్థానంలో ఉచ్ఛస్థితి సంచారం అత్యంత శుభకరం.

ఇక శని సంవత్సరమంతా షష్ఠమంలో మంచి ఫలితాలు ఇస్తాడు.

అలాగే, రాహుకేతువులు డిసెంబర్‌5వరకు పంచమ, లాభస్థానాల్లోనూ, తదుపరి చతుర్ధ, దశమస్థానాల్లోనూ సంచరిస్తారు.

వీరికి డబ్బుకు లోటు రాకుండా గడిచిపోతుంది.

లేదనుకునే సమయానికి ఏదోవిధంగా సొమ్ములు అందుతాయి.

రుణబాధలు చాలావరకూ తొలగుతాయి.

కుటుంబంలోని వారితో సత్సంబంధాలు నెలకొంటారు.

కొంత కాలంగా వైరాగ్యం ప్రదర్శించిన మీరు ఈ ఏడాది నూతనోత్సాహంతో గడుపుతారు.

అందరినీ మెప్పించే నేర్పరితనంతో ముందుకు దూసుకువెళతారు.

ఆత్మీయులు, బంధువుల ద్వారా తరచూ ఆహ్వానాలు, వర్తమానాలు అందుతాయి.

శత్రువులు అనుకున్న వారు కూడా మీ బాటలో పయనిస్తారు.

వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొంటారు.

స్థిరాస్తుల విషయంలో కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి. గురువు ఉచ్ఛస్థితి సంచారంలో అంటే జూన్‌2వ తేదీ నుండి రాజకీయవేత్తలకు అనూహ్యమైన పదవులు, హోదాలు రావచ్చు.

అలాగే, విద్యార్థులు విశేషమైన ర్యాంకులు సాధిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ లాభ సూచనలు.

మీ అనుమానాలు పెద్దల ద్వారా నివృత్తి చేసుకుంటారు.

ప్రతి నిర్ణయం వెనుక ఆప్తుల సలహాలు ఉంటాయి.

శుభకార్యాల రీత్యా అధిక ధనవ్యయం.

కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.

దైవకార్యక్రమాలలో మరింత చురుగ్గా పాల్గొంటారు.

శని శుభుడే అయినా షష్ఠమ రాశి సంచారం వల్ల ఆరోగ్యపరంగా చికాకులు, తద్వారా వైద్యసేవలు అవసరం కావచ్చు.

వ్యాపార, వాణిజ్యవర్గాలకు లాభాలు తగినంతగా దక్కవచ్చు. భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

ఉద్యోగులు పెండింగ్ బకాయిలు అందుకుంటారు.

అలాగే, ఉన్నత పోస్టులు దక్కించుకుంటారు.

వ్యవసాయదారులకు రెండుపంటలు సానుకూలం.

కళాకారులు, సాంకేతికరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు.

క్రీడాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

డిసెంబర్‌5 నుండి రాహువు అర్థాష్ఠమ స్థితి వల్ల చేసే పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు.

మానసికంగా ఆందోళన.

కోర్టు వివాదాలు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.

మొత్తం మీద అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అదృష్టసంఖ్య–6, వజ్రం ధరించాలి.

వీరు రాహువుకు పరిహారాలు చేయించుకోవాలి.

సుందరకాండ పారాయణ మంచి ఫలితాలు ఇస్తుంది.

01 జనవరి 2026 - 31 డిసెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

తుల (23 సెప్టెంబర్ నుండి 22 అక్టోబర్)

ఇంతకాలం ఎదురుచూసిన నిరుద్యోగులకు విజయం చేకూరి ఉత్సాహంగా గడుపుతారు.

అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

ఇంటిలో శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు.

సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు, ఒత్తిడులు తొలగుతాయి.

కొన్ని సమస్యలు తీరి మరింత ఊరట కలుగుతుంది..

ఆరోగ్యపరంగా ప్రథమార్థంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.

విచిత్రసంఘటనలు ఎదురై ఆశ్చర్యపరుస్తాయి.

కొన్ని సమయాలలో అప్రయత్నంగా కార్యజయం, ధనలాభాలు కలుగుతాయి.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి.

వ్యాపారాలు ఊపందుకుంటాయి. అయితే ద్వితీయార్థంలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు, అప్రమత్తత అవసరం.

ఉద్యోగాలలో ఊహించని మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. విధి నిర్వహణలో సహచరుల సహకారం అందుతుంది.

రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారులకు మరింత రాణింపు ఉంటుంది. అలాగే, సరైన గుర్తింపు లభిస్తుంది.

వ్యవసాయదారుల కృషి ఫలిస్తుంది.

జనవరి, మార్చి, ఏప్రిల్, మే, నవంబర్, నెలలు ప్రతికూలం. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు, బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు.

అదృష్టసంఖ్య–6, నీలం, ఆకుపచ్చ రంగులు అనుకూలం.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి