
19 మార్చి 2026 - 06 ఏప్రిల్ 2027
జన్మ నక్షత్రం ప్రకారం
ఆదాయం – 5, వ్యయం – 14, రాజపూజ్యం – 5, అవమానం – 4
వీరికి జూన్ 1 వ తేదీ వరకూ గురువు ద్వితీయమందు విశేషంగా ఉంటుంది.
తదుపరి తృతీయమందు ఉచ్ఛ స్థానంలో సంచార సమయం కూడా మంచిదే.
ఇక శని లాభ స్థానంలో సంచారం అత్యంత శుభదాయకం.
డిసెంబర్ 5 వరకూ రాహుకేతువులు దశమ, చతుర్ధ స్థానాలలోను తదుపరి భాగ్య, తృతీయ స్థానాలలో సంచారం అనుకూలం.
వీరికి మధ్యమధ్యలో మినహా అనుకూల పరిస్థితులు ఉంటాయి.
ఆర్థికంగా కొంత ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడతారు.
అప్పులు చేసైనా ఖర్చులు అధిగమిస్తారు.
స్థిరాస్తులు కొన్ని విక్రయించే అవకాశం ఉంది.
గురుని తృతీయ రాశి సంచారంలో సోదరులు, సోదరీల నుండి ఊహించని సాయం అందుతుంది.
అలాగే, వారితో సృహుద్భావ పరిస్థితులు నెలకొంటాయి.
శని ప్రభావం వల్ల అందరితోనూ సఖ్యత.
స్నేహసంబంధాలు మెరుగుపడతాయి.
దీర్ఘకాలిక రుగ్మతల నుండి బయటపడతారు.
అయితే జూలై –డిసెంబర్ మధ్య శని వక్రగతి కారణంగా ఆరోగ్యంపై ప్రధానంగా శ్రద్ధ అవసరం.
హఠాత్తుగా ఆప్తులతో విరోధాలు రావచ్చు. మరింత సహనంతో మెలగాలి.
మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి.
మిమ్మల్ని వ్యతిరేకించే వారిని సైతం ప్రేమిస్తారు.
ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు యత్నాలకు ద్వితీయార్థం సానుకూలం.
ఇతరులకు సలహాలపై ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయడం ఉత్తమం.
తరచూ పుణ్యక్షేత్రాల సందర్శనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తారు.
వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
కొత్త వ్యాపారాల ప్రారంభానికి సన్నద్ధులవుతారు.
ఉద్యోగులకు ఒక ఊహించని అవకాశం దక్కవచ్చు.
ఆకస్మిక మార్పులు ఉండవచ్చు.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఒత్తిడులు తగ్గుతాయి.
విదేశీ పర్యటనలు కూడా చేస్తారు.
రాజకీయవేత్తల కృషి ఫలించి కొత్త పదవులు కూడా చేపట్టవచ్చు.
విద్యార్థులు కోరుకున్న ఫలితాలు రాక నిరాశ చెందుతారు.
కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.
క్రీడాకారులు చేజార్చుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలిస్తుంది.
ఇంట వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.
చిత్రవిచిత్రమైన సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.
మొత్తానికి అన్ని విధాలా కలసివచ్చేకాలమే.
జూన్ 2 తరువాత గురునికి పరిహారాలు చేయించుకోవడం మంచిది.
అదృష్టసంఖ్య–6, వజ్రం ధరిస్తే శుభదాయకం.
నరసింహస్వామిని పూజించండి.
01 జనవరి 2026 - 31 డిసెంబర్ 2026
జన్మ తేది ప్రకారం
ఎవరితోనైనా సరే మితంగా మాట్లాడుతూ ముందుకు సాగడం ఉత్తమం.
మీ సత్తా నిరూపించుకునేందుకు అవకాశాలు వస్తాయి.
బంధువులు, మిత్రులు మీ సహనాన్ని పరీక్షించేందుకు యత్నిస్తారు. అయితే చివరికి మీ మాటే చెల్లుతుంది.
ముఖ్య వ్యవహారాలను ఆటంకాలు అధిగమించి విజయవంతంగా పూర్తి చేస్తారు.
అందరి హృదయాలు గెలుచుకుని కీర్తి ప్రతిష్ఠలు దక్కించుకుంటారు..
అవివాహితులైన వారికి వివాహయోగం.
నిరుద్యోగులు ఉద్యోగాలు సాధిస్తారు..
ఆర్థికంగా ఇబ్బందులు తొలగి లబ్ధి పొందుతారు. రావలసిన డబ్బు అందుతుంది.
కుటుంబంలో మీపట్ల మరింత సానుకూల వైఖరి నెలకొంటుంది.
ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా తిరిగి స్వస్థత చేకూరుతుంది..
వ్యాపారాలు క్రమేపీ లాభాల దిశగా కొనసాగుతాయి. మీ లావాదేవీల్లో ఇతరుల జోక్యం వద్దు.
ఉద్యోగాలలో అనుకున్న బా«ధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తారు.
పారిశ్రామికవర్గాలు, కళాకారులకు కొత్త అవకాశాలు రావచ్చు. అయితే కొంత శ్రమ కూడా తప్పదు.
వ్యవసాయదారులు ఆచితూచి ముందుకు సాగాలి.
ఐటీ రంగం వారికి శుభసమయం వచ్చింది.
మహిళలు అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని చాటుకుంటారు.
ఏప్రిల్, జూన్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, నెలలు కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. నమ్ముకున్న వారే మీకు నష్టం కలిగించవచ్చు. మానసికంగా సంఘర్షణ ఎదుర్కొంటారు.
అదృష్టసంఖ్య–6. వీరు నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులు విజయానికి సూచికగా ఉంటాయి.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి












