Sri Bhagavatam – Battle of Rama Ravana .. Coronation of Sri Rama

రావణుడు తన సైన్య సమూహాలను .. సోదరుడిని .. కుమారులను కోల్పోతాడు. తన వాళ్లంతా తనని విడిచి వెళ్లడంతో ఒంటరిగా మిగిలిపోతాడు. అయినా రాముడితో యుద్ధానికి వెళతాడు. రామ రావణ యుద్ధం భీకరంగా జరుగుతుంది. సారధిని .. రథాన్ని కూడా కోల్పోయిన రావణుడికి ఆలోచించుకోమని చెప్పి రాముడు మరో అవకాశం ఇస్తాడు. అయినా వినిపించుకోకుండా ఆ మరునాడు రావణుడు మళ్లీ యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధంలో రాముడు రావణుడిని హరిస్తాడు. లంకానగరానికి విభీషణుడు రాజు అవుతాడు.

అప్పటివరకూ రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని రాముడి దగ్గరికి తీసుకువస్తారు. ఆమెకి అగ్నిపరీక్ష పెట్టిన రాముడు, ఆమె పాతివ్రత్యాన్ని లోకానికి చాటుతాడు. ఆ తరువాత విభీషణుడు ఇచ్చిన పుష్పక విమానంలో వానరులతో కలిసి బయల్దేరతాడు. అలా వాళ్లు “భరద్వాజ మహర్షి” ఆశ్రమానికి చేరుకుంటారు. తాము అక్కడ ఉన్నామనే విషయాన్ని హనుమంతుడి ద్వారా భరతుడికి కబురు చేస్తాడు రాముడు. ఈ విషయం తెలియగానే భరతుడు సంతోషంతో పొంగిపోతాడు.

భరద్వాజ మహర్షి ఆశ్రమం నుంచి అయోద్య నగరానికి భరతుడు వాళ్లను ఊరేగింపుగా తీసుకువస్తాడు. రాముడి పాదాలకు నమస్కరించి, ఇక తనకి అప్పగించిన బాధ్యత పూర్తయిందనీ, అయోధ్య సింహాసనాన్ని అధిష్టించమని కోరతాడు అందుకు అవసరమైన ఏర్పాట్లను వశిష్ఠ మహర్షి దగ్గరుండి చూసుకుంటాడు. ఒక శుభ ముహూర్తాన శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. సీతారాములు తిరిగి వచ్చినందుకు .. అయోధ్యకి రాజుగా సింహాసనాన్ని అధిష్టిచినందుకు ప్రజలంతా సంతోషంతో సంబరాలు జరుపుకుంటారు.

శ్రీ రాముడి పరిపాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు. రాముడు చూపిన మార్గంలోనే వాళ్లంతా ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉంటారు. సీతాదేవి గర్భవతి అవుతుంది .. సూర్యవంశానికి వారసుడు రాబోతున్నందుకు అందరూ కూడా ఆనందిస్తారు. 14 ఏళ్ల పాటు అరణ్యవాసంలో ఎన్నో కష్టాలు పడిన సీతను రాముడు ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. కౌసల్యతో పాటు కైకేయి .. సుమిత్ర కూడా సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో  సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Battle of Rama Ravana .. Coronation of Sri Rama