19 మార్చి 2026 - 06 ఏప్రిల్ 2027
జన్మ నక్షత్రం ప్రకారం

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం – 2, వ్యయం – 11, రాజపూజ్యం – 4, అవమానం – 7

ఈ రాశి వారికి గురువు వ్యయస్థాన సంచారమైనా మూర్తిమంతం వల్ల శుభుడు, అలాగే, జూన్‌ 2వ తేదీ నుండి జన్మరాశిలో ఉచ్ఛస్థితిలో సంచారం అత్యంత శుభదాయకం.

అలాగే, భాగ్యస్థానంలో శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు.

కష్టించి పనిచేసే వారికి విశేషంగా కలసివస్తుంది.

అంటే శ్రమ పడ్డా ఫలితం ఉంటుంది.

ఇక వీరికి డిసెంబర్‌వరకూ అష్టమం, తదుపరి సప్తమరాశుల్లో రాహు సంచారం దోషకరం.

అలాగే,డిసెంబర్‌ 5 నుండి జన్మరాశిలో కేతు సంచారం కూడా దోషకారకమే.

ఈరీత్యా పరిశీలిస్తే వీరికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు కనిపించవు.

వచ్చినా ఏదో విధంగా సర్దుకుంటాయి.

ఇక కుటుంబంలో సంతోషకరమైన జీవనం సాగిస్తారు.

సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.

వివాహాది శుభకార్యాల నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు.

ఆశ్చర్యకరంగా ద్వితీయార్థంలో సొంత ఇంటి కల నెరవేరే సూచనలున్నాయి.

అలాగే, వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

కీర్తిప్రతిష్ఠలు సంపాదించి ఒక గుర్తింపు పొందుతారు.

అనుకున్న కార్యక్రమాలను కొంత శ్రమ పడినా పూర్తి చేస్తారు.

ఒక మిత్రుడు ఊహించని రీతిలో ఆదుకుంటాడు.

విద్యార్థులకు మంచి ర్యాంకులు దక్కుతాయి.

వ్యాపారాలలో అడుగుముందుకు వేసి లాభాలు గడిస్తారు.

కొత్త పెట్టుబడులు సమకూర్చుకునేందుకు తగిన సమయం.

ఉద్యోగస్తులు కోరుకున్న∙బదిలీలు ఉంటాయి.

బాధ్యతలు అధికమైనా పైస్థాయి నుండి ప్రోత్సాహం లభిస్తుంది.

పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, సాంకేతిక రంగాల వారికి విశేషయోగదాయకమైన కాలం.

రాజకీయవేత్తలకు ప్రజాదరణ పెరుగుతుంది.

కొత్త పదవులు దక్కించుకుంటారు.

కళాకారులు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి.

ఇక ఈ ఏడాది మొత్తం రాహుకేతువుల సంచారం అనుకూలం కానందున ఆరోగ్యం, కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

ప్రతి వ్యవహారంలోనూ ఆటంకాలు అధిగమిస్తూ రావలసి వస్తుంది.

జీవిత భాగస్వామితో అకారణంగా వివాదాలు.

వాహనదారులు మరింత అప్రమత్తంగా మెలగాలి.

అదృష్టసంఖ్య–2, వీరు ముత్యం ధరించాలి.

రాహుకేతువులకే ఎక్కువగా పరిహారాలు చేయించుకోవాలి.

శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

01 జనవరి 2026 - 31 డిసెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

కర్కాటకం (21 జూన్ నుండి 22 జూలై)

సామాజిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించి ఆదిశగా అడుగులు వేస్తారు.

మీ హితబోధలు కొందరిపై ప్రభావం చూపవచ్చు.

మీరు నమ్మిన వ్యక్తులు మరింత చేయూతనిస్తారు..

కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.

విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు.

మీ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు రంగం సిద్ధం చేస్తారు.

కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.

ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు.

ఇంటి నిర్మాణాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తారు. ద్వితీయార్థంలో ఫలిస్తాయి.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఎంతో నేర్పుగా ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి, అయితే అవసరాల రీత్యా కొన్ని అప్పులు కూడా చేస్తారు.

ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి.

వ్యాపారాలలో కొంత మేరకు లాభాలు అందుతాయి. పెట్టుబడులు సమకూర్చుకునేందుకు చేసే యత్నాలు సానుకూలమవుతాయి.

ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు అధిగమిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వ్యవసాయదారులు రెండవపంట అనుకూలించి ఉపశమనం పొందుతారు.

ఐటీ రంగం వారికి చెప్పుకోతగిన అభివృద్ధి ఉంటుంది.

మహిళలకు ఎంతోకాలంగా ఎదురవుతున్న సమస్యలు తీరతాయి.

జనవరి, ఫిబ్రవరి, జూన్, ఆగస్టు, అక్టోబర్‌నెలల్లో మరింత అప్రమత్తత అవసరం. ప్రతి వ్యవహారంలోనూ, ఆరోగ్యపరంగా చికాకులు. ప్రయాణాలలో అవాంతరాలు. లేదా ప్రమాదాలు.

అదృష్టసంఖ్య–2, పసుపు, బిస్కట్‌రంగులు అనుకూలం.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి