19 మార్చి 2026 - 06 ఏప్రిల్ 2027
జన్మ నక్షత్రం ప్రకారం

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)

ఆదాయం – 2, వ్యయం – 8, రాజపూజ్యం – 1, అవమానం – 2.

ఈరాశి వారికి జూన్‌2 నుండి సప్తమ స్థానమైన ఉచ్ఛస్థితిలో గురు సంచారం విశేషం.

అప్పటి వరకూ షష్ఠమ సంచారం వల్ల మానసిక ఆందోళన. ధనవ్యయం.

రాబడి తగ్గడం వంటి ఫలితాలు ఉంటాయి.

ఇక శని అనుకూలుడు. అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు.

శ్రమపడ్డా ఫలితం ఇస్తాడు.

ఇక డిసెంబర్‌5వరకు రాహుకేతువులు ద్వితీయ, అష్టమ స్థానాల్లో సంచరించి తదుపరి జన్మ, సప్తమరాశుల్లో సంచరిస్తారు.

వీరు సామాన్య ఫలితాలు ఇస్తారు.

మొత్తానికి వీరికి ద్వితీయార్థమే అత్యంత సానుకూలమైదిగా చెప్పొచ్చు ద్వితీయార్థంలో ఆర్థికంగా బలం చేకూరినా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి.

మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.

మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు.

ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపంలో పెడతారు.

చిరకాలంగా ఎదురవుతున్న కొన్ని చిక్కులు వీడతాయి.

అనుకున్న పనులు పూర్తి చేయడంలో పట్టుదలతో కృషి చేస్తారు.

మరింతగా తీర్థ యాత్రలు చేస్తారు.

వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు ద్వితీయార్థం విశేషంగా కలసివస్తుంది.

అనుకున్న లాభాలు అందుతాయి.

ఉద్యోగవర్గాలకు పదోన్నతులు రావచ్చు.

అలాగే, ఆశించిన బదిలీలు జరిగే సూచనలున్నాయి.

పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం.

న్యాయవాదులు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

క్రీడాకారులు మరింత కీర్తి పొందుతారు.

వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.

అయితే ఆరోగ్యంపై ప్రథమార్థం తగు జాగ్రత్తలు పాటించాలి.

ముఖ్యంగా చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు ఉండవచ్చు.

అదృష్టసంఖ్య–8. వీరు నీలం ధరించాలి.

గురు, రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.

రుద్రనమకం, సూర్యారాధన మంచిది.

01 జనవరి 2026 - 31 డిసెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

మకరం (23 డిసెంబర్ నుండి 22 జనవరి)

కొన్ని లక్ష్యాల సాధనలో అవాంతరాలు అధిగమిస్తారు.

బంధువులు, మిత్రుల సూచనలు మేరకు అతి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

చాకచక్యంగా వివాదాలు పరిష్కరించుకుంటారు.

స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు కుదుర్చుకుని అడ్వాన్సులు చెల్లిస్తారు.

సోదరులు,సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త కాంట్రాక్టులను దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించవచ్చు.

తీర్థయాత్రలు చేస్తారు.

ప్రథమార్థంలో సంతానరీత్యా చికాకులు నెలకొనవచ్చు.

ఆర్థిక పరిస్థితి మొత్తానికి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.

వ్యాపారస్తులు అనుకున్నలాభాల కోసం చేసే యత్నాలు సఫలం. పెట్టుబడులకు ఇబ్బందులు తీరతాయి. భాగస్వాములతో తగాదాలు తీరతాయి.

ఉద్యోగస్తులకు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తారు..

క్రీడాకారులు,రాజకీయవేత్తలు, కళాకారులు అవకాశాలు చేజిక్కించుకుంటారు.

ఐటీ రంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు..

మహిళలకు మరిన్ని విజయాలు.

ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, ఆగస్టు నెలలు ప్రతికూలం. అనుకోని సంఘటనలు, ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. కొన్ని వేడుకలు, కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వృథాగా ఖర్చులు చేస్తారు.

అదృష్టసంఖ్య–8, ఆకుపచ్చ, నీలం, అనుకూలం.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి