కార్తీక పురాణం

32   Articles
32

సరళమైన తెలుగులో కార్తీక మాస ముప్పై రోజుల కార్తీక పురాణం కథలని చదవండి.

శ్రీమహావిష్ణువు లీలావిశేషాలలో భాగంగా శ్రీకృష్ణ సత్యభామల గురించి శౌనకాది మునులతో సూతుడు చెప్పడం మొదలుపెడతాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు .. రుక్మిణీ సమేతుడై ఉండగా దేవలోకం నుంచి నారద మహర్షి వస్తాడు. ఆయన చేతిలో ఉన్న “పారిజాత పుష్పం” గురించి కృష్ణుడు…

Continue Reading

కృష్ణుడి ద్వారా తన గత జన్మను గురించి తెలుసుకున్న సత్యభామ, తిథులలో ఏకాదశి .. మాసాలలో కార్తీకం ఎందుకు ప్రీతికరమైనవో చెప్పవలసిందిగా కోరుతుంది. ఇదే విషయాన్ని గతంలో పృథు చక్రవర్తి అడిగితే నారద మహర్షి అందుకు గల కారణాలను చెప్పాడనీ, ఆ…

Continue Reading

కార్తీకమాసంలో తులసితో శ్రీమహా విష్ణువును పూజించడం మరింత పుణ్యఫలాలను ఇస్తుందని తెలుసుకున్న పృథు మహారాజు, శ్రీమహావిష్ణువుకు తులసి అంత ప్రీతికరమైనది ఎలా అయిందని అడుగుతాడు. అందుకు సమాధానంగా నారద మహర్షి చెప్పడం మొదలుపెడతాడు. ఒకసారి దేవేంద్రుడు తన పరివారాన్నంతటిని తీసుకుని కైలాసానికి…

Continue Reading

జలంధరుడు తమని వెదుకుతూ వస్తున్నాడనే విషయం మేరు పర్వత గుహల్లో దాక్కున్న దేవతలకు తెలిసిపోతుంది. దాంతో వాళ్లంతా భయపడిపోతూ శ్రీమహావిష్ణువును ప్రార్ధిస్తారు. వాళ్ల ప్రార్ధనలు చెవిన పడగానే గరుడవాహనంపై శ్రీమహావిష్ణువు యుద్ధభూమికి చేరుకుంటాడు. విష్ణుమూర్తికి … జలంధరుడికి మధ్య పోరాటం జరుగుతూ…

Continue Reading

కైలాసానికి దూతగా వెళ్లిన రాహువు, అక్కడి నుంచి తిరిగివచ్చి చెప్పిన మాటలు జలంధరుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తాయి. దాంతో శివుడిపై యుద్ధానికి ఏర్పాట్లు చేయవలసిందిగా తన పరివారాన్ని ఆదేశిస్తాడు. అనేకమంది సైన్యంతో కైలాసం పైకి యుద్ధానికి బయల్దేరతాడు. ఈ విషయం దేవతలకు తెలుస్తుంది….

Continue Reading

పరమశివుడిని నియంత్రించడం కోసం జలంధరుడు “మాయ గౌరీ”ని సృష్టిస్తాడు. ఆమెను రథంపై బంధించి బాధిస్తున్నట్టుగా శివుడికి చూపుతాడు. ఆ దృశ్యం చూడగానే శివుడు అచేతనుడై పోతాడు. అదే అదనుగా భావించిన జలంధరుడు, శివుడిపై విరుచుకుపడటానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడు …..

Continue Reading

కార్తీక మాస విశిష్టతను .. వైభవాన్ని .. కార్తీక వ్రత మహాత్మ్యం గురించి తెలుసుకున్న పృథు చక్రవర్తి, ఇంతకుముందు ఎవరెవరూ ఆయా వ్రతాన్ని ఆచరించారో, ఆ వ్రతం విశేషమేమిటో తెలుపవలసిందిగా నారద మహర్షిని కోరతాడు. అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్పడం…

Continue Reading

ఓ విష్ణు దూతలారా .. భూలోక వాసులంతా ఎంతగానో దానధర్మాలు చేస్తున్నారు. నోములు – వ్రతాలు ఆచరిస్తున్నారు. అసలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఏది? దేనిని ఆచరించడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది? దయచేసి ఈ ఒక్క విషయాన్ని తెలియజేయగలరు అని…

Continue Reading

విష్ణుమూర్తి పట్ల అసమానమైన భక్తి శ్రద్ధలు కలిగినవారు మాత్రమే విష్ణు లోకానికి చేరుకుంటారని ధర్మదత్తుడితో విష్ణుదూతలు చెబుతారు. అయితే జయ విజయులకు వైకుంఠంలో స్వామివారి ద్వారపాలకులుగా ఆ స్థానాలు ఎలా లభించాయని ధర్మదత్తుడు విష్ణుదూతలను అడుగుతాడు. అప్పుడు వారు ఇలా చెప్పడం…

Continue Reading

నారద మహర్షి .. పృథు మహారాజుకు మధ్య జరిగిన సంభాషణను గురించి, కృష్ణుడి ద్వారా సత్యభామ తెలుసుకుంటుంది. అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి? ఉత్తమగతులు ఎలా లభిస్తాయి? అని కృష్ణుడిని సత్యభామ అడుగుతుంది. అందుకు కృష్ణుడు ఇలా చెప్పడం మొదలుపెడతాడు. కృతయుగంలో…

Continue Reading