11 మే 2025 - 17 మే 2025
జన్మ నక్షత్రం ప్రకారం
కొత్త కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేస్తారు.
స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.
కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు.
మీలో దాగిన నైపుణ్యతను వెలుగులోకి తెచ్చేందుకు ఒకరు యత్నిస్తారు.
వారికి సహకరించండి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
అతిగా పొగిడే వారిపట్ల జాగ్రత్తగా ఉండండి.
కొంత గందరగోళంలో పడతారు.
పలుకుబడి కలిగిన వారు పరిచయమై కొంత సహాయపడతారు.
మీకంటూ సమాజంలో గౌరవం లభిస్తుంది.
పాత బాకీలు కొంతమేర వసూలై ఆర్థికంగా బలపడతారు.
పెండింగ్ బాకీలు కొన్ని చెల్లిస్తారు.
వృథా ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది.
బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.
మునుపటి బంధాలు కలిగి ఉత్సాహంగా గడుపుతారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగుతాయి.
కాస్త నయం కావచ్చు. అయితే ఆహారం విషయంలో మితం పాటిచండి.
వ్యాపారులకు మరింత లాభాలు దక్కవచ్చు.
అనూహ్యంగా కొత్త వ్యాపారాలలోకి పిలుపు రావచ్చు.
ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు తొలగుతాయి.
ఏ బాధ్యత అప్పగించినా వెనుకడుగు వేయరు.
వైద్యులు, క్రీడాకారులు, కళాకారులకు నూతనోత్సాహం. అవకాశాలు పెరుగుతాయి.
టెక్నాలజీ రంగం వారు అప్పగించిన ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు.
మహిళలు అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు.
సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
11 మే 2025 - 17 మే 2025
జన్మ తేది ప్రకారం
కుంభం (23 జనవరి నుండి 22 ఫిబ్రవరి)
ప్రారంభంలో కొన్ని సమస్యలు నెలకొన్నా క్రమేపీ బయటపడతారు.
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.
చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
వాహనాలు, స్థలాలు కొంటారు.
శత్రువులు స్నేహితులుగా మారతారు.
మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు.
ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు.
తీర్థ యాత్రలు చేస్తారు.
వృత్తులు, వ్యాపారాల వారికి మరింత సానుకూలత.
కళాకారులు సత్కారాలు అందుకుంటారు.
వాహన యోగం. వారారంభంలో వివాదాలు. అనారోగ్యం.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి











