02 ఫిబ్రవరి 2025 - 08 ఫిబ్రవరి 2025
జన్మ నక్షత్రం ప్రకారం

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

పరపతి పెరుగుతుంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు.

సభలు,సమావేశాలలో పాల్గొంటారు.

ఇంత కాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం.

పెండింగ్ బాకీలు వసూలవుతాయి. ధనలబ్ధి.

కుటుంబ సభ్యులు మీ పై మరింత ప్రేమానురాగాలు కురిపిస్తారు.

శుభవార్తలు. కొద్దిపాటి రుగ్మతలు బాధించవచ్చు.

వ్యాపారాలు మరింత విస్తరిస్తారు.

కొత్త పెట్టుబడులకు అనుకూలం.

ఉద్యోగుల పై వచ్చిన అపవాదులు తొలగుతాయి.

పై స్థాయి వారి సహాయం అందుకుంటారు.

రాజకీయవర్గాలకు సన్మానాలు.

మహిళలకు సమస్యలు తీరతాయి.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

02 ఫిబ్రవరి 2025 - 08 ఫిబ్రవరి 2025
జన్మ తేది ప్రకారం

మేషం (21 మార్చి నుండి 19 ఏప్రిల్)

అనుకున్న కార్యాలు సమయానికి పూర్తి చేస్తారు.

ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీపై ప్రశంసలు కురిపిస్తారు.

మీ ఆలోచనలు అమలులో పెడతారు.

రాబడి మరింత సంతృప్తినిస్తుంది.

కొన్ని సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకుని ముందుకు సాగుతారు.

విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు పొందుతారు.

నూతన వ్యక్తుల పరిచయం. వాహన సౌఖ్యం.

మీ నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి.

ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి.

కాంట్రాక్టర్లు అనుకున్న పనులు చేజిక్కించుకుంటారు.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారులకు లాభాలు అందుతాయి.

ఉద్యోగస్తులకు అనుకున్న హోదాలు దక్కుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు.

వారాంతంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. శారీరక రుగ్మతలు.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి