11 మే 2025 - 17 మే 2025
జన్మ నక్షత్రం ప్రకారం
అందరిలోనూ గౌరవమర్యాదలు లభిస్తాయి.
ముఖ్యమైన కార్యక్రమాలు విజయపథంలో సాగుతాయి.
విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి.
తీర్థ యాత్రలు చేస్తారు.
ఆలోచనలు తక్షణం అమలు చేయడం ఉత్తమం.
ప్రతి వ్యవహారంలోనూ వేగం పాటించండి.
దూర ప్రయాణాలు చేస్తారు.
పలుకుబడి కలిగిన వ్యక్తులు చేయూతనిస్తారు.
ఉద్యోగ యత్నాలు కలసివచ్చే అవకాశం
ఆదాయానికి ఎటువంటి ఇబ్బందిలేకుండా గడుపుతారు.
ఇతరులకు చెల్లించాల్సిన మొత్తాలు సిద్ధం చేస్తారు.
తొందరపాటు హామీలు వద్దు. పొరపాటున కూడా డబ్బు చేజారనీయకండి.
అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
బంధువులు ఒక శుభవార్త తెస్తారు. వివాహయత్నాలు సానుకూలం.
కాళ్లకు సంబంధించిన రుగ్మతలు బాధిస్తాయి.
ఆస్తులు విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు.
వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి.
వ్యాపారులు మునుపటి కంటే లాభాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.
కొత్త భాగస్వాముల పట్ల ఒకసారి ఆలోచించడం మంచిది.
ఉద్యోగస్తులు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
రాజకీయవేత్తలు, వైద్యులు వ్యూహాత్మకంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు.
టెక్నాలజీ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వీరి సేవలు విస్తృతమవుతాయి.
మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అంగారక స్తోత్రాలు పఠించండి.
11 మే 2025 - 17 మే 2025
జన్మ తేది ప్రకారం
ఆదాయం కొంత నిరాశ పరుస్తుంది.
సమయానికి చేపట్టిన కార్యాలు పూర్తి కాక కొంత మదనపడతారు.
మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు.
స్నేహితులతో తగాదాలు.
ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది.
దేవాలయాలు సందర్శిస్తారు.
నిరుద్యోగుల యత్నాలు నిదానిస్తాయి.
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
వృత్తులు, వ్యాపారాలలోని వారికి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఒత్తిడులు పెరుగుతాయి.
కళాకారులు,పారిశ్రామికవేత్తలకు అవకాశాలు సన్నగిల్లుతాయి.
వారాంతంలో కొత్త పరిచయాలు.
వస్తు లాభాలు. తీర్థ యాత్రలు.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి











