02 ఫిబ్రవరి 2025 - 08 ఫిబ్రవరి 2025
జన్మ నక్షత్రం ప్రకారం
పనులు చకచకా పూర్తి కాగలవు.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
మిత్రులతో వివాదాలు తీరతాయి.
ఆస్తుల విషయంలో నూతన అగ్రిమెంట్లు.
విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు.
రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.
రావలసిన సొమ్ము అందుతుంది.
కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కారం.
సోదరుల నుంచి సహాయం అందుతుంది.
ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం.
విస్తరణలో ముందడుగు వేస్తారు.
ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి.
పై స్థాయి వారి అభినందనలు అందుకుంటారు.
రాజకీయవర్గాలకు ఆశించిన పదవులు దక్కుతాయి.
సన్మానాలు, సత్కారాలు.
మహిళలకు ఆస్తిలాభ సూచనలు.
దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
02 ఫిబ్రవరి 2025 - 08 ఫిబ్రవరి 2025
జన్మ తేది ప్రకారం
శ్రమానంతరం కొన్ని కార్యక్రమాలు చేస్తారు.
రాబడి అనుకున్న విధంగా ఉంటుంది.
కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి.
సోదరులతో సఖ్యత నెలకొని ఉత్సాహంగా గడుపుతారు.
ఆరోగ్యం పై కొంత శ్రద్ధ వహించండి.
సన్నిహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.
కాంట్రాక్టర్లకు శుభవార్తలు.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
పరిచయాలు మరింతగా పెరుగుతాయి.
వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి, లాభాలు తగినంతగా ఉంటాయి.
ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి.
పారిశ్రామికవర్గాలను విజయాలు వరిస్తారు.
రాజకీయవర్గాల ఆశలు నెరవేరే సమయం.
విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి.
వారం మధ్యలో అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి