02 ఫిబ్రవరి 2025 - 08 ఫిబ్రవరి 2025
జన్మ నక్షత్రం ప్రకారం
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు.
చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
స్థిరాస్తి వివాదాల నుంచి బయపడతారు.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.
పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు.
రావలసిన సొమ్ము అందుతుంది.
కుటుంబంలోని అందరితోనూ సంతోషకరంగా గడుపుతారు.
బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు.
కొద్దిపాటి అనారోగ్య సూచనలు.
వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు.
ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి.
ప్రమోషన్లు లభించవచ్చు.
పారిశ్రామికవర్గాలు కంపెనీల ఏర్పాటులో విజయం సాధిస్తారు.
ఐటీ నిపుణుల పరిశోధనలు మంచి ఫలితాలిస్తాయి.
మహిళలకు శుభవార్తలు అందుతాయి.
గణేశ్ స్తోత్రాలు పఠించండి.
02 ఫిబ్రవరి 2025 - 08 ఫిబ్రవరి 2025
జన్మ తేది ప్రకారం
చేపట్టిన కార్యాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు.
ఆత్మీయుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి.
ఆలోచనలు కలసిరాక నిరుత్సాహం చెందుతారు.
కుటుంబసమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు.
అవసరాలకు డబ్బు అందుతుంది.
దూర ప్రయాణాలు సంభవం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
చిత్రవిచిత్ర సంఘటనలు, సమాచారాలు.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు.
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
వ్యాపారులు లాభనష్టాలకు సమానంగా ఉంటాయి.
ఉద్యోగులకు ఆశించిన హోదాలు శ్రమానంతరం దక్కుతాయి.
పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.
కళాకారులు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.
వారాంతంలో వృథా ఖర్చులు.
మానసిక ఆందోళన.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి