11 మే 2025 - 17 మే 2025
జన్మ నక్షత్రం ప్రకారం
కొత్త వ్యక్తులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.
అనుకున్న కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పూర్తి చేసి సమర్థత చాటుకుంటారు.
స్నేహితులతో సంబంధబాంధవ్యాలు బాగుంటాయి.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకు పయనమవుతారు.
ఎంతటి ఖ్యాతి లభించినా గర్వం దరిచేరనీయరు.
గతంలో ఒకరి వద్ద నిలిచిపోయిన పెద్ద మొత్తం లభించవచ్చు.
దీర్గకాలిక రుణ బాధలు తొలగుతాయి.
భవిష్యత్తు పై మరింత భరోసా కలుగుతుంది.
పెద్దల సహాయసహకారాలు సంపూర్ణంగా అందుకుంటారు.
సోదరులు, బంధువుల సలహాలు పొంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు.
భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపోహ ఏర్పడే సూచనలున్నాయి.
తొందరపాటు మాటలు వద్దు.
స్వల్ప అనారోగ్యం. చెవికి సంబంధించిన బాధలు రావచ్చు.
వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు.
కొత్త భాగస్వాములు చేరడంతో మరింత అనుకూలిస్తుంది.
ఉద్యోగులకు ఆశించినరీతిలో మార్పులు జరిగే సూచనలున్నాయి.
అధికారులు మీపై కొన్ని విషయాలలో నెపాలు మోపవచ్చు. పని విషయంలో రాజీవద్దు.
క్రీడాకారులు, వైద్యులు,కళాకారులు ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగుతాయి.
టెక్నాలజీ రంగం వారికి కొత్త ఆఫర్లు రావచ్చు. ఏ మాత్రం వదలవద్దు.
మహిళలు విదేశీ పర్యటనలు చేయవచ్చు.
శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.
11 మే 2025 - 17 మే 2025
జన్మ తేది ప్రకారం
మీ పై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.
అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు.
ఆశ్చర్యకరమైన రీతిలో ధన లాభాలు కలుగుతాయి.
శత్రువులను సైతం ఆదరించి ప్రశంసలు పొందుతారు.
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
గృహ నిర్మాణాల్లో కొద్దిపాటి ఆటంకాలు.
వృత్తులు, వ్యాపారాలలోని వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి.
విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు.
విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి.
వారం మధ్యలో ఖర్చులు. మానసిక అశాంతి.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి











