06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొన్ని కార్యక్రమాలు అత్యంత నేర్పుగా పూర్తి చేస్తారు.

ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలచుకుని విజయాలు సాధిస్తారు.

శ్రేయోభిలాషుల సూచనలు, సలహాలు పొందుతారు.

సమాజంలో విశేష గౌరవం దక్కుతుంది.

తీర్థ యాత్రలు చేస్తారు.

యుక్తిగా మసలుకుంటూ ఎవరినీ నొప్పించకుండా ముందుకు సాగుతారు.

ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.

రుణాలు తీరి ఒడ్డునపడతారు. కొత్త పొదుపు మార్గాలు అనుసరిస్తారు.

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది.

బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.

కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య తీరుతుంది.

వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొంటారు. స్థలాలు సమకూరతాయి.

వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.

విస్తరణలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులకు ఢోకా ఉండదు.

ఉద్యోగస్తులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు.

ఏ బాధ్యత అప్పగించినా వెనుకాడరు.

వైద్యులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఎట్టకేలకు అవకాశాలు లభిస్తాయి.

టెక్నికల్ రంగం వారికి ప్రమోషన్లు దక్కే అవకాశం.

మహిళల ఆశయాలు నెరవేరతాయి.

లక్ష్మీనృసింహ కరావలంబం పఠించండి.

06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

వృశ్చికం (23 అక్టోబర్ నుండి 22 నవంబర్)

హామీలు నిలుపుకుని సత్తా చాటుకుంటారు.

మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

రాబడి గతం కంటే మరింత మెరుగుపడుతుంది.

ప్రయాణాలలో నూతన పరిచయాలు.

సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు.

ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు. కుటుంబంలో వేడుకలు నిర్వహిస్తారు. వ్యాపారులు ఒడిదుడుకుల నుంచి బయటపడతారు.

ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

రాజకీయవేత్తలకు మరింత కలిసివచ్చే కాలం.

కళాకారులు అరుదైన అవకాశాలు దక్కించుకుంటారు.

వారాంతంలో ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి