11 మే 2025 - 17 మే 2025
జన్మ నక్షత్రం ప్రకారం
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
ఇంతకాలం మరుగునపడిన మీలోని ప్రతిభ వెలుగుచూస్తుంది.
కార్యభారాన్ని లెక్కచేయకుండా లక్ష్యాల వైపు సాగుతారు.
ముఖ్య కార్యక్రమాలు సమయానికి పూర్తి చేసి ఊరట చెందుతారు.
స్నేహితులతో అత్యంత కీలక విషయాలు చర్చిస్తారు.
విద్యార్థుల కలలు ఫలిస్తాయి.
వాక్చాతుర్యంతో అందరి మెప్పు పొందుతారు.
మీ మనస్సులోని ఉద్దేశాలను నిర్భయంగా వెల్లడిస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
రాబడి ఆశాజనకంగా ఉండి ఉత్సాహంగా గడుపుతారు.
కొంత కాలంగా పడుతున్న ఇబ్బందులు తీరవచ్చు.
కొంత సొమ్ము చేజారే సూచనలున్నాయి. జాగ్రత్తపడండి.
సోదరులతో మరింత సత్సంబంధాలు ఏర్పడతాయి.
బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు.
మీ అభిప్రాయాలను అందరికీ వెల్లడిస్తారు.
కొంత మెరుగుపడి దైనందిన కార్యక్రమాలలో పాల్గొంటారు.
భూముల పై కొత్తగా పెట్టుబడులు పెడతారు.
అలాగే, గృహం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చుకుని లాభాలు ఆర్జిస్తారు.
ఎవరు ఎన్ని చెప్పినా మీదారిలోనే పయనిస్తారు. ఇదే మంచి విధానం.
ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు.
ఉన్నతాధికారులు మీ సేవలకు ముగ్ధులవుతారు.
కొన్ని డాక్యుమెంట్లలో తేడాలు రావచ్చు. అప్రమత్తత అవసరం.
వైద్యులు, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఊహించని ప్రగతి కనిపిస్తుంది.
వీరు తమ సేవలను విస్తృతం చేస్తారు.
టెక్నాలజీ రంగం వారికి మొదట ఇబ్బందిగా ఉన్నా క్రమేపీ అనుకూలిస్తుంది.
మహిళలు మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.
శ్రీ.నృసింహ స్తోత్రాలు పఠించండి.
11 మే 2025 - 17 మే 2025
జన్మ తేది ప్రకారం
చేపట్టిన కార్యాలు కొన్ని ముందుకు సాగక డీలాపడతారు.
ఆలోచనలు కలసిరావు.
కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి.
సంతానపరంగా కొన్ని చికాకులు.
ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.
నూతన వ్యక్తుల పరిచయం.
ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.
ఆశించిన ఆదాయం సమకూరక అప్పులు చేస్తారు.
విద్యార్థులు కొంత నిరాశకు లోనవుతారు. శారరీక రుగ్మతలు.
బంధువులతో తగాదాలు.
గృహ నిర్మాణ యత్నాలలో కొంతమేర కదలికలు.
వృత్తులు, వ్యాపారాల వారికి చికాకులు.
పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి.
క్రీడాకారులకు సమస్యలు తప్పవు.
వారాంతంలో శుభవార్తా శ్రవణం. వస్తు లాభాలు
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి











