11 మే 2025 - 17 మే 2025
జన్మ నక్షత్రం ప్రకారం
ముఖ్యమైన కార్యక్రమాలు మరింత నెమ్మదించి సహనానికి పరీక్షగా నిలుస్తాయి.
ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించక నిరాశకు లోనవుతారు.
ఓర్పుగా ఉన్నా మీపై విమర్శలు తప్పవు.
అయితే తొందరపాటు వద్దు.
అన్నీ మనమంచికే అన్నట్లుగా ఉండండి.
కాంట్రాక్టర్లు కొంత నిదానంగా వ్యవహరించడం మంచిది.
దేవాలయాలు సందర్శిస్తారు.
స్నేహితులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి.
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.
రావలసిన డబ్బు సైతం సకాలంలో రాక ఇబ్బందులు పడతారు.
ఎప్పుడూ అడగని వారిని సైతం అప్పులు అడుగుతారు.
సోదరులతో వివాదాలతో సతమతమవుతారు.
మీ పైనే ఆరోపణలు రావచ్చు.
బందువుల ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
ఆత్మవిశ్వాసం వీడకుండా ఉండండి. దైవ బలం తోడుగా నిలుస్తుంది.
ఆరోగ్యం గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది.
వైద్య సహాయం అవసరం లేకపోవచ్చు.
ఆస్తుల విషయంలో జరగాల్సిన ఒప్పందాలు వాయిదా పడతాయి.
అలాగే, పొదుపు చేసిన మొత్తాలు కూడా వినియోగించాల్సిన పరిస్థితి.
వ్యాపారులు కొన్ని చిక్కులు ఎదురైనా లావాదేవీలు నిర్వహిస్తారు.
లాభాలు మాత్రం నామమాత్రంగా ఉంటాయి.
భాగస్వాముల నుండి వచ్చే ఒత్తిడులు తట్టుకునేలా ప్రయత్నం చేయండి.
ఉద్యోగులకు విధుల్లో ఇబ్బందులు ఎదురై సవాలుగా మారవచ్చు.
వైద్యులు,కళాకారులకు అవకాశాలు తగ్గి నిరాశ చెందుతారు.
టెక్నాలజీ రంగం వారికి కొంతలో కొంత అనుకూల పరిస్థితి ఉండవచ్చు.
మహిళలలో ప్రతివిషయానికి ఆందోళన కనిపిస్తుంది.
కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
11 మే 2025 - 17 మే 2025
జన్మ తేది ప్రకారం
కొన్ని కార్యాలు మధ్యలోనే విరమిస్తారు.
మీ ఆలోచనలు నిలకడ ఉండవు.
బంధువులతో విభేదాలు నెలకొంటాయి.
ఆదాయం లభించినా ఖర్చులు కూడా పెరుగుతాయి.
దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
చాకచక్యం, ఓర్పుతో ముందుకు సాగడం మంచిది.
నిర్ణయాల పై తొందరపాటు వద్దు.
ఆస్తి విషయంలో చికాకులు, కోర్టు వివాదాలు ఉండవచ్చు.
వృత్తులు, వ్యాపారాలు నిరాశాజనకంగా కొనసాగుతాయి.
రాజకీయ నాయకుల అంచనాలు తప్పుతాయి.
కళాకారులు, పరిశోధకులకు చిక్కులు.
వారాంతంలో శుభవార్తలు.
ధనలబ్ధి. వాహన యోగం.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి











