30 మార్చి 2025 - 18 మార్చి 2026
జన్మ నక్షత్రం ప్రకారం

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం - 2, వ్యయం - 14, రాజపూజ్యం - 5, అవమానం - 2

ఈ సంవత్సరం గురు, రాహువులతో పరీక్షా కాలంగా ఉంటుంది. మే 14 నుండి అక్టోబర్ 18 వరకు, తిరిగి నవంబర్ 11 నుండి అష్టమ గురు దోషం.

అలాగే, మే 19 నుండి సంవత్సరమంతా అర్థాష్టమ రాహు దోషం ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు లేకున్నా ఖర్చులు అధికమై సతమతం కాగలరు.

నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సైతం చేజారి నిరాశ చెందుతారు.

శుభకార్యాల రీత్యా ఖర్చులు విపరీతంగా ఉంటాయి.

మీ మాటకు కుటుంబంలో సానుకూలత రాకపోవచ్చు.

ప్రతి వ్యవహారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.

ఏ నిర్ణయమైనా ఆప్తుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం.

మిత్రులు, సన్నిహితులతో అకారణంగా వైరం.

వాహనాలు, భూములు కొనాలన్న ఆలోచన కలిగి ఆ దిశగా అడుగులు వేస్తారు. అయితే కష్టసాధ్యమైనా ప్రయత్నం ఫలిస్తుంది.

చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపడతారు.

అక్టోబర్ నవంబర్ మధ్య గురు బలం వల్ల ఆకస్మిక ధన లబ్ధి.

మానసిక ప్రశాంతత, పరిపూర్ణ ఆరోగ్యం సమకూరతాయి.

శాస్త్ర సాంకేతిక రంగాల వారుతమ ప్రతిభను చాటుకుంటారు.

వ్యాపారాలలో లాభనష్టాలను సమస్థాయిలో పొందుతారు.

కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు.

ఉద్యోగస్తులకు విధుల్లో కొన్ని అవాంతరాలు వచ్చిన అధిగమిస్తారు.

కొన్ని బదిలీలు నిలిచిపోయే అవకాశం ఉంది.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు, కొత్త సంస్థలకు అనుమతుల కోసం యత్నిస్తారు.

రాజకీయవర్గాలకు సరైన గుర్తింపు దక్కవచ్చు.

కళాకారులకు అనుకోని అవకాశాలు కొంత ఊరటనిస్తాయి.

విద్యార్థుల యత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి.

వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది.

గురుని అష్టమ స్థితి, రాహువు అర్థాష్టమ స్థితి వల్ల మానసిక ఆందోళన, చికాకులు. ఇతరులతో మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది.

వీరు కనకధారా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

అదృష్ట సంఖ్య - 9.

01 జనవరి 2025 - 31 డిసెంబర్ 2025
జన్మ తేది ప్రకారం

వృశ్చికం (23 అక్టోబర్ నుండి 22 నవంబర్)

ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పనులు, చేయాలనుకొన్న పనులు ఒకదాని తర్వాత ఒకటి పూర్తవుతూ వస్తాయి.

ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది.

ముఖ్యం గా వైవాహిక జీవితం ఆనందం గా ఉంటుంది.

అన్నిట్లోనూ తమదైన ముద్రవేసుకొని విజయం సాధిస్తారు.

మార్చి తర్వాత ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

మానసికంగా కూడా కొంత ఒడిదొడుకులు ఏర్పడుతాయి.

ఖర్చులు కూడా అధికమవుతాయి, లైఫ్ స్టైల్ లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపార సంబంధమైన నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి.

సంవత్సరం రెండో భాగం లో కుటుంబం లో చికాకులు కూడా పెరిగే అవకాశం కలదు, ఎదో ఒక విషయం మిమ్మల్ని కలచి వేస్తుంది, మీ ప్రమేయం లేకుండానే ఒక సమస్యలో ఇరుక్కొని అవకాశం కలదు.

ముఖ్యంగా పాటించవలసిన సూచనలు - ఆహారపు అలవాట్లు అదుపులో ఉంచుకోవాలి ముఖ్యం గా జీర్ణ వ్యవస్థని నియంత్రణ లో ఉంచాలి.

వృత్తిరీత్యా అవకాశాలని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి