30 మార్చి 2025 - 18 మార్చి 2026
జన్మ నక్షత్రం ప్రకారం

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 6, అవమానం - 6

ఈ సంవత్సరం విశేష గురు బలంతో విజయాల బాటలో దూసుకువెళతారు.

సప్తమంలో శని కొంత ప్రతికూలం కాగా, షష్టమంలో రాహువు, వ్యయంలో కేతువు ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. మొత్తానికి వీరు ఎదురులేని విధంగా గడుపుతారు.

ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి సాధిస్తారు.

ఒకరి ద్వారా ఆశలు వదులుకున్న ధనం కూడా అందుతుంది.

కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పులకు అవకాశం.

మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు ఆచరిస్తారు.

కొన్ని సమస్యలు వీడి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

ఆస్తులు కొనుగోలులో ముందుంటారు.

ఈ ఏడాది గృహ యోగం, వివాహాది శుభకార్యాల నిర్వహణ వంటి వాటికి ఖర్చు చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.

విద్యార్థులు ఊహించని ర్యాంకులు సాధిస్తారు.

వ్యాపార, వాణిజ్యరంగాల వారికి ఇతోధికంగా లాభాలు రాగలవు.

అలాగే, భాగస్వాములతో వివాదాలు తీరతాయి.

ఉద్యోగులకు తాము ఊహించిన దానికంటే అధికంగా లబ్ధి చేకూరుతుంది.

పారిశ్రామికవర్గాల నూతన ప్రాజెక్టులు చేపడతారు.

ఐటీ నిపుణులకు చెప్పుకోతగిన మార్పులు ఉంటాయి.

రాజకీయవేత్తలకు పదవులు రావచ్చు.

కళాకారులు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

వ్యవసాయదారుల ఆశలు నెరవేరతాయి.

అయితే సప్తమ శని, వ్యయంలో కేతువు ప్రభావం వల్ల చర్మ, నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు.

అలాగే, భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు నెలకొంటాయి. తొందరపాటు మాటలు లేకుండా, ఆచితూచి వ్యవహరిస్తూ సాగడం మంచిది.

మే 18 వరకు ప్రయాణాలు, ఇతర ముఖ్య వ్యవహారాలలో మరింత జాగ్రత్తలు పాటించాలి. మిగతా నెలలు అనుకూలమే.

వీరు శని, కేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. శ్రీ దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు పఠించండి.

అదృష్ట సంఖ్య - 5.

01 జనవరి 2025 - 31 డిసెంబర్ 2025
జన్మ తేది ప్రకారం

కన్య (23 ఆగస్టు నుండి 22 సెప్టెంబర్)

ఇప్పటి వరకు ఏదైతే మిస్ అయ్యాం అనుకొంటున్నవన్నీ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యం గా కెరీర్ కి సంబందించిన అవకాశాలు లభిస్తాయి వాటిని అంది పుచ్చుకొని ముందడుగు వేస్తే విజయం మీ సొంతమవుతుంది.

కొంత రిస్క్ తీసుకొన్నా శుభఫలితాలు కలుగుతాయి.

ప్రత్యర్థులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా విజయం సాధించలేరు.

విదేశీ సంబంధమైన వృత్తులలో ఆదాయం వృద్ధి చెందుతుంది.

ఆదాయం ఉన్నప్పటికీ విపరీతమైన ఖర్చులు కూడా ఉంటాయి.

దైవసంబంధిత కార్యక్రమాలలో తరచూ పాల్గొంటారు.

కుటుంబంలో ఒక వ్యక్తి కొరకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది.

ముఖ్యం గా పాటించవలసిన సూచనలు - సంవత్సర రెండో భాగం లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొనే విషయం లో నిదానం వహించాలి.

గురు గ్రహాన్ని పూజించడం వలన పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆవుకి గోధుమలు లేదా గోధుమ రొట్టెలు ఆహరం గా ఇవ్వడం, శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోసుకోవడం.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి