11 మే 2025 - 17 మే 2025
జన్మ నక్షత్రం ప్రకారం

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

స్నేహితులతో మరింత సఖ్యత నెలకొంటుంది.

నిరుద్యోగులకు శుభవర్తమానాలు.

తరచూ ప్రయాణాలు సంభవం.

కొన్ని నిర్ణయాలపై ఆలోచనలో పడతారు.

మీ ఖ్యాతి, గౌరవం మరింత పెరుగుతుంది.

ఎంతటి వారైనా మీ సలహా కోసం సంప్రదించే సమయం.

వాగ్ధాటితో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటారు.

ఇంత కాలం ఆదాయానికి పడిన ఇబ్బందులు తొలగుతాయి.

రుణ బాధలు చాలావరకూ తీరతాయి.

పరిమితికి మించిన ఖర్చులు మీదవేసుకోవద్దు.

ఉన్నది సరిపెట్టుకుంటూ నడపండి.

బంధువుల ఆదరణ పొందుతారు.

సోదరులతో విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు.

కొన్ని శుభకార్యాల పై నిర్ణయాలు తీసుకుంటారు.

పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారు. స్వల్ప రుగ్మతలు లెక్కచేయరు.

భూములు, వాహనాలు కొనుగోలుకు యత్నాలు ముమ్మరం చేస్తారు.

కోర్టులో ఉన్న కేసు కూడా పరిష్కారమవుతుంది.

వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు.

కొత్త వ్యాపార ఆలోచనలు కలసివచ్చి హుషారుగా ముందడుగు వేస్తారు.

భాగస్వామ్యాల ఒప్పందాలలో ఆచితూచి సాగడం మంచిది.

ఉద్యోగులు రావలసిన ప్రమోషన్లు పొందుతారు.

చాకచక్యంగా విధులు నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు.

క్రీడాకారులు, కళాకారులు, రాజకీయవేత్తలకు మరిన్ని అవకాశాలు రావచ్చు.

టెక్నాలజీ రంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు.

మహిళలకు సంతోషదాయకంగా ఉంటుంది.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

11 మే 2025 - 17 మే 2025
జన్మ తేది ప్రకారం



మిథునం (21 మే నుండి 20 జూన్)

కొన్ని కార్యాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

గతం గుర్తుకు వచ్చి కొంత నిరాశ చెందుతారు.

మీ నిర్ణయాలు అందరూ శిరోధార్యంగా భావిస్తారు.

సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఆశించిన ఆదాయం సమకూరుతుంది.

ఊహించని రీతిలో ధన, వస్తు లాభాలు.

ఎంతటి వారినైనా మీదారికి తెచ్చుకుంటారు.

ఇంటి నిర్మాణాల పై దృష్టి సారిస్తారు.

వృత్తులు, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు.

వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యం చికాకు పరుస్తుంది.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి