30 మార్చి 2025 - 18 మార్చి 2026
జన్మ నక్షత్రం ప్రకారం

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆదాయం - 2, వ్యయం - 14, రాజపూజ్యం - 5, అవమానం - 7

వీరికి ఈ సంవత్సరం ఏల్నాటి శని ప్రారంభం. గురువు, రాహు,కేతువుల సంచారం అనుకూలం.

కొన్ని ఆటుపోట్లు, సమస్యలు ఎదురైనా మొత్తానికి అధిగమించి శుభదాయకంగానే గడుపుతారు.

శని ప్రభావంతో రాబడి కంటే ఖర్చులు పెరిగి అప్పుల కోసం అన్వేషిస్తారు.

ఇక మే 18 వరకు గురువు వృషభ రాశిలో సంచార సమయంలో ధన లాభాలు, స్థిరాస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగడం, సంతాన విషయంలో సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి.

ఈతి బాధలు, సమస్యల నుంచి కొంత వరకూ బయటపడతారు.

సోదరులు, బంధువుల నుంచి సకాలంలో ప్రోత్సాహం లభిస్తుంది.

నిరుద్యోగులకు కృషి ఫలించి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

పట్టుదలతో కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు.

సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి.

ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించడం ముఖ్యం.

ఉదర సంబంధిత రుగ్మతలు ఇబ్బంది పెట్టవచ్చు.

ఇంట వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు, తద్వారా ఖర్చులు ఉంటాయి.

విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అనూహ్యంగా కొన్ని విద్యావకాశాలు సాధిస్తారు.

ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపంలో పెడతారు.

విరివిగా తీర్థ యాత్రలు చేస్తారు.

శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

వ్యాపారస్తులు ఊహించని విధంగా లాభాలు పొందుతారు. పెట్టుబడులపై తుది నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు.

ఉద్యోగస్తులు అంకితభావంతో పనిచేస్తారు. కొందరికి బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవర్గాల కృషి ఫలించి ముందడుగు వేస్తారు.

రాజకీయవేత్తల యత్నాలలో మరింత పురోగతి కనిపిస్తుంది.

కళాకారులకు చేజారిన కొన్ని అవకాశాలు తిరిగి దక్కవచ్చు.

వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరతాయి.

మే అక్టోబర్ మధ్య కాలం, నవంబర్ నుండి సంవత్సరాంతం వరకు సామాన్యంగానే గడుస్తుంది.

వీరు శనైశ్చరునికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామికి అర్చనలు, దుర్గా స్తోత్రాల పఠనం చేయడం ఉత్తమం.

అదృష్ట సంఖ్య - 9.

01 జనవరి 2025 - 31 డిసెంబర్ 2025
జన్మ తేది ప్రకారం

మేషం (21 మార్చి నుండి 19 ఏప్రిల్)

సంవత్సర ప్రారంభం నుండి కూడా అన్ని విధాలా చక్కటి అభివృద్ధి మరియు చక్కటి మార్పులు వీరు గమనించవచ్చు.

ఆర్దికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది.

ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వ్యాపారస్తులు ఊహించినదానికన్నా అధికంగా ఆదాయం సంపాదిస్తారు.

విద్యార్థులు కలలు నెరవేరే సమయం.

కొన్ని పనులు నత్తనడకన సాగినప్పటికీ లేదా పెండింగ్ పడినప్పటికీ సెప్టెంబర్ తర్వాత నుండి పుంజుకొంటాయి.

స్థిరాస్తులు కొనాలనుకునే వారు ఈ సంవత్సరం ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఏ వృత్తి లో ఉన్నా అవకాశాలని అందిపుచ్చుకొంటే చక్కటి విజయాలు నమోదు చేసుకోగలుగుతారు. వీరికి ప్రత్యేకమైన సూచన ఏమిటంటే అనవసరమైన విషయాలలో తలదూర్చడం వలన సమస్యలు ఎదురుకోవలసి వస్తుంది. ఈ విషయాన్నీ గుర్తుంచుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అలాగే ప్రతి చిన్న విషయానికి చికాకు కోపం తగ్గించుకోవడం మంచిది.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి